BRS CM KCR : అడవి బిడ్డలకు పోడు భూముల పట్టాలు
జూన్ 30 నుంచి పంపిణీ కార్యక్రమం
BRS CM KCR : తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఈ మేరకు రాష్ట్రంలో ఈనెల 30 నుంచి గిరిజనులకు పోడు భూములను పంపిణీ చేయనుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు(CM KCR) ఆదేశించారు. పోడు భూముల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని ఆసిఫాబాద్ జిల్లా కేంద్రం నుండి అదే రోజున సీఎం కేసీఆర్ లాంఛనంగా ప్రారంభించనున్నారు.
ఇదే సమయంలో సీఎం ప్రారంభించిన వెంటనే రాష్ట్ర వ్యాప్తంగా పార్టీకి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు వారి వారి స్వంత జిల్లాలు , నియోజకవర్గాలలో పోడు పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టనున్నారు.
ఇదిలా ఉండగా జూన్ 24 శనివారం నుంచే పోడు భూముల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. కానీ అనివార్య కారణాల వల్ల 24న కాకుండా జూన్ 30న పంపిణీ చేసేందుకు నిర్ణయం తీసుకుంది. జాతీయ ఎన్నికల సంఘం రాష్ట్రంలో పర్యటిస్తుండడం, ఆయా జిల్లాల కలెక్టర్లకు శిక్షణా తరగతులు నిర్వహిస్తుండడం, 29న బక్రీదు పండుగ ఉండడంతో పోడు భూముల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని వాయిదా వేయాల్సి వచ్చిందని బీఆర్ఎస్ ప్రభుత్వం స్పష్టం చేసింది.
ఇదే సమయంలో అదే రోజు కొత్తగా నిర్మించిన ఆసిఫాబాద్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయం, జిల్లా ఎస్పీ కార్యాలయాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు.
Also Read : Anurag Thakur : కాషాయానికి ఢోకా లేదు – ఠాకూర్
