KTR : మాదే రాజ్యం 100 సీట్లు ఖాయం -కేటీఆర్

ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి కామెంట్స్

KTR : తెలంగాణ ప‌రిశ్ర‌మ‌ల‌, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్(KTR) సంచ‌ల‌న కామెంట్స్ చేశారు. త్వ‌ర‌లో రాష్ట్రంలో జ‌ర‌గ‌బోయే అసెంబ్లీ ఎన్నిక‌ల్లో భార‌త రాష్ట్ర స‌మితి పార్టీకి ప‌క్కా 100 సీట్లు వ‌స్తాయ‌ని ధీమా వ్య‌క్తం చేశారు. ఇందులో ఎలాంటి అనుమానం అక్క‌ర్లేద‌న్నారు. దేశ చ‌రిత్ర‌లో బీఆర్ఎస్ అరుదైన ఘ‌న‌త‌ను సృష్టించేందుకు రెడీగా ఉంద‌న్నారు కేటీఆర్. ముచ్చ‌ట‌గా మూడోసారి సీఎం కేసీఆర్ సార‌థ్యంలో ప్ర‌భుత్వం ఏర్పాటు చేస్తామ‌ని స్ప‌ష్టం చేశారు.

త‌మ అంచ‌నా ప్ర‌కారం 90 సీట్ల నుంచి 100 సీట్లు వ‌స్తాయ‌ని ఇందులో డౌట్ లేద‌న్నారు మంత్రి. తెలంగాణ రాష్ట్ర స‌మితి పార్టీ నుంచి భార‌త రాష్ట్ర స‌మితిగా మారిన త‌ర్వాత తొలి ఆవిర్భావ దినోత్స‌వాన్ని హైద‌రాబాద్ లో ఘ‌నంగా చేప‌ట్టారు. ఈ సంద‌ర్భంగా మంత్రి కేటీఆర్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్ర‌సంగించారు.

రాష్ట్రంలో అధికారం లోకి రావాల‌ని క‌ల‌లు కంటున్న ప్ర‌తిప‌క్ష పార్టీలు భార‌తీయ జ‌న‌తా పార్టీ, కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్లు కూడా ద‌క్క‌వ‌న్నారు. దేశంలో ఎక్క‌డా లేని రీతిలో సంక్షేమ ప‌థ‌కాల‌ను , కార్య‌క్ర‌మాల‌ను అమ‌లు చేసిన ఘ‌న‌త త‌మ పార్టీకే ద‌క్కింద‌న్నారు. ఐటీ ప‌రంగా దేశానికే ఆద‌ర్శంగా రాష్ట్రం నిలిచింద‌ని స్ప‌ష్టం చేశారు కేటీఆర్(KTR).

Also Read : దేశాభివృద్దిలో సాంకేతిక‌త కీల‌కం

Leave A Reply

Your Email Id will not be published!