BRS : మూసీ, హైడ్రా బాధితులను మేము ఆదుకుంటాం బీఆర్‌ఎస్ బృందం
మూసీ, హైడ్రా బాధితులను మేము ఆదుకుంటాం బీఆర్‌ఎస్ బృందం
BRS: తెలంగాణ భవన్ నుంచి క్షేత్రస్థాయిలో బీఆర్‌ఎస్ బృందం పర్యటించింది. మాజీ మంత్రులు హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి, మల్లారెడ్డి, గంగుల కమలాకర్, మహమ్మద్ హాలీ ఆధ్వర్యంలో మూసీ, హైడ్రా బాధితుల వద్దకు బీఆర్ఎస్(BRS) నేతలు బయలుదేరారు. ఈ బీఆర్ఎస్ బృందంలో ఎమ్మెల్యేలు, రాజశేఖర్ రెడ్డి, వివేక్ గౌడ్, కాలేరు వెంకటేష్ , మాధవరం కృష్ణారావు, సంజయ్, పాడి కౌశిక్ రెడ్డి ఉన్నారు. హైదర్‌షాకోట్‌తో పాటు సమీప కాలనీల్లో బీఆర్‌ఎస్ బృందం పర్యటిస్తుంది. మూసీ పరీవాహక కాలనీల్లో అధికారుల సర్వే పరిశీలన, ప్రజల్లో నెలకొన్న భయాందోళనలు వినడంతో పాటు బాధితులకు పార్టీపరంగా భరోసా ఇవ్వనున్నారు.
BRS Comment
పలువురు అపార్ట్‌మెంట్లు, విల్లాల వాసులతో బీఆర్‌ఎస్ నేతలు సమావేశంకానుంది. హైడ్రా బాధితులకు న్యాయం, సాయం చేస్తామని ఇప్పటికే బీఆర్‌ఎస్ ప్రకటించింది. రాష్ట్రంలో పాలన పిచ్చోడి చేతిలో రాయిలా మారిందని హరీష్‌రావు మండిపడ్డారు. తెలంగాణలో తుగ్లక్ పాలన సాగుతోందన్నారు. సీఎం రేవంత్ మూసీ సుందరీకరణ పేరిట రియల్ వ్యాపారం చేస్తున్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని ఆయన డిమాండ్ చేశారు.
Also Read : Danam Nagender : కాంగ్రెస్ లో చేరేందుకు 10 మంది ఎమ్మెల్యేలు సిద్ధమంటున్న దానం..