BRS MLA’s Response : సీఎంతో భేటీ పై వస్తున్న వార్తలకు చెక్ పెట్టిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు
నియోజకవర్గంలోని సమస్యలపై చర్చించేందుకు తాను సీఎం రేవంత్‌రెడ్డిని కలిశానని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి తెలిపారు
BRS MLA’s : తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీ మార్పు వార్తలపై స్పందించారు. పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తలను ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి ఖండించారు. తాము ఎవరితోనూ చర్చలు జరపలేదని, ప్రోటోకాల్ , ఎస్కార్ట్ ఇవ్వలేదని సీఎం రేవంత్‌రెడ్డిని కలిసి ఫిర్యాదు చేశామన్నారు. ఉమ్మడి మెదక్ జిల్లా అంశాలపై చర్చించామన్నారు. బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ మార్గదర్శకత్వంలో పని చేస్తానన్నారు. పార్టీ మారే ఉద్దేశం తనకు లేదని, కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని సునీత లక్ష్మారెడ్డి ఫైర్ అయ్యారు.
BRS MLA’s Comment Viral
నియోజకవర్గంలోని సమస్యలపై చర్చించేందుకు తాను సీఎం రేవంత్‌రెడ్డిని కలిశానని బీఆర్‌ఎస్(BRS) ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి తెలిపారు. కాంగ్రెస్‌లో చేరతారనే ప్రచారాన్ని ఆయన ఖండించారు. అంతకుముందు మెదక్ లోక్ సభ నియోజకవర్గాలకు సంబంధించిన సమస్యలపై ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులతో చర్చలు జరిపినట్లు తెలిపారు. అలాగే దుబ్బాక సమస్యపై సీఎం, మంత్రులను కలిశామన్నారు. ఏం ఇబ్బంది అని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ప్రశ్నించారు.
పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి, దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్ రావు, ఇంటెలిజెన్స్ చీఫ్ శివధర్ రెడ్డి ప్రొటోకాల్ ఉల్లంఘనపై మంగళవారం ఫిర్యాదు చేశారు. అధికారిక కార్యక్రమాల్లో అనధికార నాయకులు కూడా పాల్గొంటున్నారని, రాజ్యాంగబద్ధమైన ప్రొటోకాల్ హక్కులకు భంగం కలిగిస్తే రాజకీయంగా ఇబ్బందులు తలెత్తే ప్రమాదం ఉందన్నారు. అధికారిక కార్యక్రమాల నుంచి పోలీసు బందోబస్తును ఇవ్వడంలేదని, దీనిపై తక్షణమే విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరారు. సీఎం రేవంత్‌తో భేటీ అనంతరం నలుగురు ఎమ్మెల్యేలు పార్టీ మారే వార్తలపై వివాదాస్పద వ్యాఖ్యలకు స్పందించారు.
Also Read : MP Ranjith Reddy Case : బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో బీఆర్ఎస్ ఎంపీపై కేసు నమోదు