BRS: హైడ్రా బాధితుల తరఫున కొట్లాడుతాం: బీఆర్‌ఎస్‌

హైడ్రా బాధితుల తరఫున కొట్లాడుతాం: బీఆర్‌ఎస్‌

హైడ్రా కూల్చివేతల పేరుతో బుల్డోజర్లు వస్తే.. వాటికంటే ముందు తాము వస్తామని భరోసా ఇచ్చినా బీఆర్‌ఎస్‌ నాయుకులు. శనివారం మధ్యాహ్నాం తెలంగాణ భవన్‌లో మూసీ సుందరీకరణ బాధితులతో ఆ పార్టీ నేతలు సమావేశం అయ్యారు. ఈ భేటీలో పలువురు కూల్చివేతలతో తమకు జరుగుతున్న నష్టం గురించి కంటతడి పెట్టుకున్నారు. ‘‘కొడంగల్‌లో రేవంత్ రెడ్డి ఇల్లు చెరువులో ఉంది. బాధితుల వద్దకు బుల్డోజర్లు వెళ్తే వాటికంటే ముందు మేము వస్తాం. ఈ ప్రభుత్వంతో మీ తరఫున మేం కొట్లాడుతాం. అధైర్యపడొద్దు’’ అని బీఆర్‌ఎస్‌ నేతలు ప్రస్తావించారు. ఈ కార్యక్రమంలో హరీష్‌రావు, సబితా ఇంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

తీవ్ర జ్వరం : కేటీఆర్‌

తెలంగాణ భవన్‌కు వస్తున్న హైడ్రా బాధితులకు అండగా నిలవాని పార్టీ నాయకులకు, శ్రేణులకు వర్కింగ్‌ ప్రెసిడెంట‌ కేటీఆర్‌ సూచించారు. గత రెండ్రోజులగా తీవ్ర జ్వరంతో బాధపడుతున్న ఆయన.. ఇవాళ్టి తెలంగాణ భవన్‌కు వెళ్లలేకపోయారు. ఈ నేపథ్యంలో ఆయన ఎక్స్‌ ఖాతాలో ఓ సందేశం ఉంచారు. హైడ్రా బాధితులకు అండగా పార్టీ సీనియర్ నాయకులు, పార్టీ ఎమ్మెల్యేలు, పార్టీ న్యాయవిభాగం అండగా ఉంటుందని తెలిపారాయన.
హైడ్రా బాధితుల కోసం బీఆర్‌ఎస్‌ క్షేత్రస్థాయి పర్యటనకు సిద్దమైంది. ఆదివారం ఉదయం బాధితుల వద్దకే బీఆర్‌ఎస్‌ బృందం వెళ్లనుందని సమాచారం. ఈ బృందంలో కేటీఆర్‌, హరీష్‌రావుతో పాటు నగర ఎమ్మెల్యేలు, మాజీమంత్రులు ఉండనున్నారు. బండ్లగూడ జాగీర్, హైదర్ షా కోట్, గంధంగూడలో పర్యటించి.. పలువురు అపార్ట్మెంట్లు, విల్లాల వాసులతో సమావేశంకానున్నారు.

Leave A Reply

Your Email Id will not be published!