BRS Slams : బ‌తుక‌మ్మ‌ను అవ‌మానించిన రాహుల్

బీఆర్ఎస్ పార్టీ షాకింగ్ కామెంట్స్

BRS Slams : హైద‌రాబాద్ – బీఆర్ఎస్ పార్టీ షాకింగ్ కామెంట్స్ చేశారు. తెలంగాణ సంస్కృతికి ప్ర‌తీక బ‌తుక‌మ్మ అని. దానికి ప్ర‌పంచ వ్యాప్తంగా గుర్తింపు తీసుకు వ‌చ్చిన ఘ‌న‌త త‌మ‌దేన‌ని పేర్కొంది. జ‌న జాగృతి సంస్థ ఆద్వ‌ర్యంలో బ‌తుక‌మ్మ ను ప్రొజెక్టు చేశార‌ని తెలిపింది.

BRS Slams Rahul Gandhi

తాజాగా రాహుల్ గాంధీ, జైరాం ర‌మేష్ తెలంగాణ ఎన్నిక‌ల ప్ర‌చారంలో పాల్గొంటున్నారు. ఈ సంద‌ర్బంగా చెప్పుల‌తో బ‌తుక‌మ్మ‌ను ఆడారు. ఇది బ‌తుక‌మ్మ‌కు ఘోర‌మైన అవ‌మాన‌మ‌ని బీఆర్ఎస్(BRS) పేర్కొంది. సోమ‌వారం ట్విట్ట‌ర్ వేదిక‌గా నిప్పులు చెరిగింది పార్టీ.

రాహుల్ గాంధీ, జైరాం రమేష్ లాంటి ఓట్ల బిచ్చగాళ్లకు తెలంగాణ సంస్కృతి గురించి… బతుకమ్మ విశిష్టత గురించి ఎప్పటికీ తెలీదంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది.

తెలంగాణకు చెందిన పీసీసీ చీఫ్, ఇతర కాంగ్రెస్ నాయకులు పొలిటికల్ టూరిస్టులను ఆపక పోగా… వాళ్ళు కూడా అదే ప‌నిగా అవ‌మానిస్తున్నారంటూ ఆవేద‌న వ్య‌క్తం చేసింది. చెప్పులు వేసుకుని బతుకమ్మ అడుతూ నవ్వుతూ, ఫోటోలకు పోజులిస్తున్నారని మండిప‌డింది.

తెలంగాణ అంటే, తెలంగాణ సంస్కృతి అంటే కాంగ్రెస్ పార్టీకి, కాంగ్రెస్ నాయకులకు ఎప్పుడూ చిన్నచూపేనంటూ వాపోయింది. తెలంగాణ రాష్ట్ర ప్రజల మనోభావాలను దెబ్బ తీసిన కాంగ్రెస్ నాయకులు తక్షణమే తెలంగాణ సమాజానికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసింది.

Also Read : Harish Rao : రేవంత్..కిష‌న్ రెడ్డి తెలంగాణ ద్రోహులు

Leave A Reply

Your Email Id will not be published!