BRS WIN : తెలంగాణ – జాతీయ స్థాయిలో పేరు పొందిన మీడియా సంస్థ టైమ్స్ గ్రూప్ నకు చెందిన టైమ్స్ నౌ న్యూస్ , ఎంటర్ టైన్మెంట్ ఛానెల్ సంచలన ప్రకటన చేసింది. దేశంలో ప్రస్తుతం 5 రాష్ట్రాలలో ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా తాము చేపట్టిన సర్వే వివరాలను ఇవాళ వెల్లడించింది టైమ్స్ నౌ.
BRS WIN Survey Viral
తెలంగాణ, ఛత్తీస్ గఢ్, మధ్య ప్రదేశ్ , రాజస్థాన్ , మణిపూర్ లలో శాసన సభ ఎన్నికలు జరగనున్నాయి. వచ్చే జనవరి 3 లోపు ఆయా రాష్ట్రాలకు సంబంధించి ఫలితాలు వెల్లడించనుంది కేంద్ర ఎన్నికల సంఘం.
ఇప్పటికే చాలా సర్వే సంస్థలు గంప గుత్తగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతోందని స్పష్టం చేస్తే టైమ్స్ నౌ మాత్రం బీఆర్ఎస్(BRS) మరోసారి క్వీన్ స్వీప్ చేయబోతోందంటూ పేర్కొంది.
దీనిని కాంగ్రెస్ పార్టీ కొట్టి పారేసింది. జనం వ్యతిరేకత తీవ్రంగా ఉందని, ప్రజలు మార్పు కోరుకుంటున్నారని , కేసీఆర్ కుటుంబం జైలుపాలు కావడం తప్పదని జోష్యం చెప్పింది. సంక్షేమ పథకాల పేరుతో రాష్ట్రాన్ని లూటీ చేశాడని, అందినంత మేర దోచుకున్నాడని ఆరోపించింది.
ఒకప్పుడు స్లిప్పర్లతో ఉన్న హరీశ్ రావుకు వేల కోట్లు ఎలా వచ్చాయంటూ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంత రావు ఆరోపించారు. మొత్తంగా టైమ్స్ నౌ సర్వే కలకలం రేపుతోంది.
Also Read : CM KCR Yagam Comment : రాజ యోగం సిద్దిస్తుందా