BS Yediyurappa : శెట్టర్ బీజేపీని వీడడం బాధాకరం
మాజీ సీఎం బీఎస్ యడ్యూరప్ప
BS Yediyurappa : కర్ణాటక మాజీ సీఎం బీఎస్ యడ్యూరప్ప సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే నెల మే 10న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ తరుణంలో మాజీ ముఖ్యమంత్రిగా పని చేసిన సీనియర్ బీజేపీ నాయకుడు జగదీశ్ శెట్టర్ బీజేపీకి గుడ్ బై చెప్పారు. ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు. తనకు సీటు ఇవ్వక పోవడంపై పార్టీ హై కమాండ్ పై నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో లింగాయత్ సామాజిక వర్గాన్ని పట్టించుకున్న పాపాన పోలేదన్నారు.
ఇదే సమయంలో బీజేపీలో చక్రం తిప్పుతున్న బీఎల్ సంతోష్ పై సంచలన ఆరోపణలు చేశారు శెట్టర్. ఆయన వల్లనే లింగాయత్ లు బీజేపీకి దూరమయ్యారంటూ ఆవేదన చెందారు. దీనిపై స్పందించారు బీఎస్ యడ్యూరప్ప(BS Yediyurappa). ఆయన జాతీయ మీడియాతో మాట్లాడారు. ఏదైనా ఉంటే తనతో మాట్లాడి ఉంటే బావుండేదన్నారు. కానీ జగదీశ్ శెట్టర్ పార్టీని వీడి తప్పు పని చేశారని ఆవేదన చెందారు.
నిబద్దత కలిగిన రాజకీయ నాయకుడిగా పేరు పొందారని పేర్కొన్నారు. తానతో మాట మాత్రమైనా చెప్పకుండా జగదీశ్ శెట్టర్ వెళ్లడం బాధ కలిగించిందన్నారు. తనకు ఆప్తుడు, సన్నిహితుడు, పార్టీకి పెద్ద దిక్కుగా ఉన్నారంటూ కితాబు ఇచ్చారు. కానీ ఇదే సమయంలో పార్టీని వీడడం వల్ల పార్టీకి కాకుండా తనకే నష్టం కలుగుతుందని పేర్కొన్నారు యెడ్యూరప్ప. ప్రస్తుతం మాజీ సీఎం చేసిన కామెంట్స్ ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
Also Read : వచ్చే ఎన్నికల్లో బీజేపీకి గడ్డుకాలం