BS Yediyurappa : సిద్దరామయ్య కామెంట్స్ యెడ్డీ సీరియస్
రిజర్వేషన్ పరిమితి ఎలా పెంచుతారంటూ ప్రశ్న
BS Yediyurappa : కర్ణాటక మాజీ సీఎం బీఎస్ యడ్యూరప్ప నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష నాయకుడు, మాజీ సీఎం సిద్దరామయ్యపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనుండడంతో బీజేపీ, కాంగ్రెస్ మాటల యుద్దం కొనసాగిస్తున్నాయి.
మే 10న పోలింగ్ జరగనుంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా సిద్దరామయ్య సంచలన ప్రకటన చేశారు. తమ పార్టీ గనుక అధికారంలోకి వస్తే కర్ణాటకలో రిజర్వేషన్ పరిమితిని 50 శాతం నుంచి 75 శాతానికి పెంచుతామని స్పష్టం చేశారు. దీనిపై ఘాటుగా స్పందించారు యడ్యూరప్ప(BS Yediyurappa).
ఇది పూర్తిగా ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు చేసిన ప్రయత్నం తప్ప మరొకటి కాదన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ఎదురు గాలి వీస్తోందన్నారు. అందుకే ఇలాంటి చవకబారు ప్రకటనలు చేస్తూ , ఆచరణకు నోచుకోని హామీలు ఇస్తూ ఓట్లు కొల్లగొట్టేందుకు యత్నిస్తున్నారంటూ యడ్యూరప్ప ఆరోపించారు.
ఇది పూర్తిగా తప్పు అని పేర్కొన్నారు. ప్రస్తుతం మాజీ సీఎం లింగాయత్ కమ్యూనిటీలో కీలకమైన నేతగా పేరు పొందారు. ఈసారి కర్ణాటకలో అధికారంలోకి వచ్చేది భారతీయ జనతా పార్టీనేనని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ కు అంత సీన్ లేదని కొట్టి పారేశారు బీఎస్ యడ్యూరప్ప(BS Yediyurappa).
ఇదిలా ఉండగా తనపై నోరు పారేసుకున్న మాజీ సీఎం యెడ్డీపై నిప్పులు చెరిగారు మాజీ సీఎం సిద్దరామయ్య. తాము ఇచ్చిన హామీని కచ్చితంగా అమలు చేసి తీరుతామని స్పష్టం చేశారు. రిజర్వేషన్ పరిమితిని 50 శాతం నుంచి 75 శాతానికి పెంచుతామని తెలిపారు.
Also Read : కర్ణాటక సర్కార్ 1.5 లక్షల కోట్లు లూటీ