BSP Protest TSPSC Leak : పేపర్ లీకులపై బీఎస్పీ ఆందోళన
సీబీఐతో విచారణ జరిపించాలి
BSP Protest TSPSC Leak : తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో చోటు చేసుకున్న పేపర్ లీకుల వ్యవహారం కలకలం రేపుతోంది. దీనిపై ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున మండి పడుతున్నారు. నిరుద్యోగులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరికొందరు ఆందోళన బాట పట్టారు. తెలంగాణ బహుజన్ సమాజ్ (బీఎస్పీ) ఆధ్వర్యంలో మంగళవారం పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. టీఎస్పీస్సీ(BSP Protest TSPSC Leak) కార్యాలయం ముందు నిరసనకు దిగారు. ఈ సందర్భంగా కార్యాలయం లోపటికి వెళ్లేందుకు ప్రయత్నం చేయడంతో పోలీసులు రంగ ప్రవేశం చేశారు.
వారిని వెళ్లనీయకుండా అడ్డుకున్నారు. టీఎస్సీపీస్సీలో ఇంకెన్నీ పరీక్షలకు సంబంధించి లీకులు జరిగాయనే దానిపై విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ మొత్తం వ్యవహారంపై కేంద్ర దర్యాప్తు సంస్థతో విచారణ చేయించాలని అన్నారు. పేపర్ లీకులకు బాధ్యత వహిస్తూ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ జనార్దన్ రెడ్డి వెంటనే రాజీనామా చేయాలని, ఇందుకు బాధ్యులైన వారిని తొలగించాలని డిమాండ్ చేశారు.
గ్రూప్ -1 ప్రిలిమ్స్ పరీక్ష కూడా లీకై ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేశారు. ఆందోళన చేపట్టిన బీఎస్పీ కార్యకర్తలను అరెస్ట్ చేశారు పోలీసులు. ఈ సందర్భంగా తమ కార్యకర్తలు, నాయకులు, విద్యార్థులను అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండించారు ఆ పార్టీ తెలంగాణ స్టేట్ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్.
అరెస్ట్ చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని కోరారు. రాష్ట్రం లీకులు..స్కాంలకు కేరాఫ్ గా మారిందని ఆరోపించారు ఆర్ఎస్పీ. ఇంత జరిగినా సీఎం కేసీఆర్ ఎందుకు మౌనంగా ఉన్నారంటూ ప్రశ్నించారు బీఎస్పీ చీఫ్.
Also Read : పేపర్ లీకులు ఫలితాలపై నీలి నీడలు