Budameru Floods Effect: బుడమేరు ఎఫెక్ట్ తో కొల్లేరుకు కొత్త టెన్షన్ !
బుడమేరు ఎఫెక్ట్ తో కొల్లేరుకు కొత్త టెన్షన్ !
Budameru Floods: ఏపీలో కురుస్తున్న భారీ వర్షాలు, బుడమేరు(Budameru Floods) కారణంగా విజయవాడలో దయనీయ పరిస్థితులు నెలకొన్నాయి. బుడమేరు పొంగి పొర్లడంతో విజయవాడ నగరంలోని పలు డివిజన్లు జలదిగ్భంధంలో చిక్కుకున్నాయి. పదుల సంఖ్యలో ప్రజలు వరదల్లో చనిపోయారు. మరోవైపు.. తాజాగా బుడమేరు ఉధృతి ఎఫెక్ట్ తో కొల్లేరులోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో లంక గ్రామాలకు ముంపు భయల నెలకొంది.
Budameru Floods Effect Updates
కొల్లేరులోకి వరద నీరు వచ్చి చేరుతుండటంతో పల్లెల్లోకి నీరు చేరుతోంది. దీనితో లంక గ్రామాలకు రాకపోకలు స్తంభించిపోయాయి. మండపల్లి, ఏలూరు, కైకలూరు మండలాల్లో కొల్లేరు వరద ప్రభావం చూపిస్తోంది. ఇప్పటికే మండవల్లి మండలంలో నుచ్చుమిల్లి, ఇంగిలిపాకలంక, పెనుమాక లంక, నందిగామలంక, ఉనికిలి, తక్కెళ్లపాడు, మణుగునూరు, కొవ్వాడలంక గ్రామాలను కొల్లేరు వరద చుట్టేసింది. మరోవైపు.. కోమటిలంక సమీపంలో కొల్లేరు ఉధృతంగా ప్రవహిస్తోంది.
చిన్నఎడ్లగాడి వద్ద జాతీయ రహదారిపై కొల్లేరు వరద ప్రవాహం కొనసాగుతోంది. దీనితో రాకపోకలు నిలిచిపోయాయి. కొల్లేరు ప్రస్తుత నీటిమట్టం 3.3 మీటర్లుగా ఉంది. ఇప్పటికే పలుచోట్ల ఇళ్లలోకి నీరు వచ్చి చేరింది. నీటిమట్టం 3.5 మీటర్లు దాటితే కొల్లేరులో గ్రామాలు పూర్తిగా మునిగిపోతాయి. ఈ నేపథ్యంలో కొల్లేరు సమీపవాసులు ఆందోళనకు గురవుతున్నారు.
Also Read : Kinjarapu Rammohan Naidu: వరద బాధితులకు అండగా ఉంటాం – కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు