Buggana Rajendranath Reddy : కర్నూలులో హైకోర్టు నిర్మాణం
ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజజేంద్ర నాథ్ రెడ్డి
Buggana Rajendranath Reddy : ఏపీ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్ర నాథ్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. అనుమతులు వచ్చిన వెంటనే కర్నూలులో హైకోర్టు నిర్మాణం చేపడతామని స్పష్టం చేశారు. ఆ దిశగా ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పారు.
Buggana Rajendranath Reddy Slams Chandrababu
మంగళవారం కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మున్సిపల్ కార్యాలయంలో ఎమ్మిగనూరు, మంత్రాలయం నియోజకవర్గాల అభివృద్దిపై సమీక్ష చేపట్టారు . ఈ సందర్బంగా మంత్రి బుగ్గన రాజేంద్ర నాథ్ రెడ్డి(Buggana Rajendranath Reddy) మాట్లాడారు. జగన్నాథ్ గట్టుపై జ్యూడిషియల్ సిటీ , లా యూనివర్శిటీకి త్వరలోనే సీఎం జగన్ మోహన్ రెడ్డి భూమి పూజ చేస్తారని వెల్లడించారు.
ప్రతిపక్ష నాయకుడు నారా చంద్రబాబు నాయుడు అబద్దాలు మాట్లాడుతున్నాడని ఆరోపించారు. ఆయన చేస్తున్నవన్నీ నిరాధారమైన ఆరోపణలని కొట్టి పారేశారు. కళ్లుండి చూడలేని కబోధి అని విమర్శించారు. ఆయనకు అధికారంలో ఉన్నప్పుడు ఇవేవీ కనిపించ లేదన్నారు.
2014 నుండి 2019 వరకు చంద్రబాబు పాలనలో 6 శాతం రాబడి రాగా జగన్ మోహన్ రెడ్డి పాలనలో 21 శాతం రాబడి వచ్చిందని స్పష్టం చేశారు ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్ర నాథ్ రెడ్డి. ప్రజలు చంద్రబాబు పాలనను జగన్ పాలనను ఒకసారి బేరీజు వేసుకోవాలని సూచించారు.
అంతకు ముందు కర్నూల్ లో రూ. 16.93 కోట్ల ఖర్చుతో ఏపీ కాలుష్య నియంత్రణ మంలడి జోనల్ ఆఫీస్ , ప్రయోగశాల నూతన భవనానికి శంకుస్థాపన చేశారు మంత్రి.
Also Read : Meta Threads : మెటా థ్రెడ్స్ ఖుష్ కబర్