Buggana Rajendranath Reddy : అభివృద్దికి విరోధి చంద్రబాబు
మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి
Buggana Rajendranath Reddy : ఏపీ ఆర్థిక, ప్రణాళిక , వాణిజ్య పన్నులు, అసెంబ్లీ వ్యవహారాలు, నైపుణ్యాభివృద్ది, శిక్షణా శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన టీడీపీ చీఫ్ , మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం నంద్యాల ప్యాపిలిలో యువత కోసం బుగ్గన కార్యక్రమంలో పాల్గొన్నారు. యువత కీలకమని, వారు లేకుంటే అభివృద్ది శూన్యమన్నారు. ప్రణాళిక, కార్యాచరణ, పాలనలో యువత భాగస్వామ్యం అత్యంత అవసరమని స్పష్టం చేశారు.
టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువ గళంలో యువకుల భాగస్వామ్యం లేదన్నారు. ఆయన ఎందుకు పాదయాత్ర చేపడుతున్నారో ఆయనకే తెలియదని ఎద్దేవా చేశారు. ఎంత సేపు వైసీపీని, జగన్ రెడ్డిని , మంత్రులను తిట్టడం తప్ప ఏమైనా యాక్షన్ ప్లాన్ చెప్పాడా అని ప్రశ్నించారు. ఇదే సమయంలో పదే పదే గొప్పలు, గప్పాలు చెబుతున్న చంద్రబాబు నాయుడు తిరుపతిలో శ్రీ సిటీ సెజ్ ను ఆపాలని అన్ని విధాలుగా ప్రయత్నం చేశాడని ఆరోపించారు మంత్రి బుగ్గన రాజేంద్ర నాథ్ రెడ్డి(Buggana Rajendranath Reddy).
అంతే కాకుండా అనంతపురం, విశాఖపట్నం, తిరుపతిలో వ్యాపార, పారిశ్రామికవేత్తలకు ఏ మాత్రం సహకారం అందించ లేదన్నారు. ఆయన చెప్పిన చోటే కంపెనీలు ఏర్పాటు చేసేలా ఒత్తిడి తెచ్చారంటూ మండిపడ్డారు.
Also Read : CM KCR : సాయిచంద్ మరణం తీరని నష్టం – కేసీఆర్