Surat Building Collapsed: సూరత్‌ లో కుప్పకూలిన భవనం ! ఏడుకు చేరిన మృతుల సంఖ్య !

సూరత్‌ లో కుప్పకూలిన భవనం ! ఏడుకు చేరిన మృతుల సంఖ్య !

Building Collapsed: గుజరాత్‌ రాష్ట్రం సూరత్‌(Surat) లో భవనం కూలిన ఘటనలో మృతుల సంఖ్య ఏడుకు చేరింది. మరో 15 మందికి గాయాలయ్యాయి. సూరత్‌లోని పాల్‌ ప్రాంతంలో శనివారం ఆరంతస్తుల భవనం కూలింది. శిథిలాల్లో చిక్కుకున్న పలువురి కోసం ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు గాలిస్తున్నాయి. 2016లో నిర్మించిన భవనం కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు కూలిపోయినట్లు పోలీసులు తెలిపారు. సమీపంలోని ఫ్యాక్టరీల్లో పని చేసే కార్మికులు ఈ భవనంలో నివసిస్తున్నారని పేర్కొన్నారు. రాత్రంతా సెర్చ్ ఆపరేషన్ కొనసాగిందని, ఏడు మృతదేహాలను బయటకు తీశామని చీఫ్ ఫైర్ ఆఫీసర్ బసంత్ పరీక్ తెలిపారు. ఈ ఘటనలో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు.

Building Collapsed – ఝార్ఖండ్‌ లో మరో ఘటన !

ఝార్ఖండ్‌ లోని డియోఘర్ నగరంలో ఆదివారం తెల్లవారుజామున మూడంతస్తుల భవనం కుప్పకూలింది. శిథిలాల్లో పలువురు చిక్కుకుపోయారు. ఘటనాస్థలికి చేరుకున్న ఎన్డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది శిథిలాల్లో చిక్కుకున్న ఇద్దరు పిల్లలు, ఓ మహిళను రక్షించారు. గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని జిల్లా కలెక్టర్‌ విశాల్‌ సాగర్‌ తెలిపారు.

గొడ్డ నియోజక వర్గ ఎంపీ దూబే మాట్లాడుతూ ‘‘ఆదివారం ఉదయం 6 గంటల సమయంలో డియోఘర్‌లోని బంబం ఝా పాత్‌లో మూడంతస్తుల భవనం కుప్పకూలింది. కేంద్ర హోం మంత్రి అమిత్ షా వెంటనే స్పందించి ఘటనా స్థలానికి సహాయక బృందాలను పంపారు. ఇప్పటి వరకు శిథిలాల నుంచి ముగ్గురిని రక్షించారు. గాయపడిన వారిని దియోఘర్ AIIMSకు తరలించి చికిత్స అందిస్తున్నాం’’ అని తెలిపారు.

Also Read : Minister Lokesh : వికలాంగ విద్యార్థుల సమస్యలపై స్పందించిన మంత్రి

Leave A Reply

Your Email Id will not be published!