Gaming Bill: ఆన్‌లైన్ బెట్టింగ్, గేమింగ్ బిల్లుకు క్యాబినెట్ ఆమోదం
ఆన్‌లైన్ బెట్టింగ్, గేమింగ్ బిల్లుకు క్యాబినెట్ ఆమోదం
Gaming Bill : ఆన్‌లైన్ బెట్టింగ్ ను అరికట్టే దిశగా కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఆన్‌లైన్‌లో బెట్టింగ్‌ను నేరంగా పరిగణిస్తూ ‘ఆన్‌లైన్ గేమింగ్ బిల్లు’ను తీసుకురాబోతోంది. దీనికి ప్రధాని మోదీ నేతృత్వంలో మంగళవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఆమోదముద్ర వేసినట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ఈ బిల్లును బుధవారం లోక్‌సభలో ప్రవేశపెట్టే అవకాశం ఉంది.
బెట్టింగ్ యాప్స్ ఆగడాలు ఇటీవల కాలంలో పెచ్చరిల్లుతున్నాయి. ఈ యాప్స్‌కు బానిసలై కొందరు అప్పుల ఊబిలో చిక్కుకోగా.. మరికొందరు ప్రాణాలు తీసుకుంటున్నారు. పలువురు సినీ, క్రీడా ప్రముఖులు ఈ యాప్‌లను ప్రమోట్ చేసినందుకు దర్యాప్తు సంస్థల నుంచి విచారణ ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో ఈ యాప్స్‌పై నిషేధం ఉంది. అయినప్పటికీ నిఘా వ్యవస్థల కళ్లుగప్పి కొందరు వీటిని వినియోగిస్తున్నారు. ఈ నేపథ్యంలో బెట్టింగ్ యాప్స్‌పై చర్యలకు కేంద్రం సిద్ధమైనట్లు తెలుస్తోంది.
Gaming Bill – క్యాబినెట్ కీలక నిర్ణయాలు
రాజస్థాన్‌లోని కోటా- బుందిలో రూ.1507 కోట్లతో కొత్త విమానాశ్రయ నిర్మాణానికి ఆమోదం
రూ.8307.74 కోట్లతో హైబ్రిడ్ యాన్యుటీ మోడ్‌లో భువనేశ్వర్ బైపాస్ నిర్మించేందుకు గ్రీన్ సిగ్నల్
Also Read : ISRO: 40 అంతస్తులంత జంబో రాకెట్ నిర్మిస్తున్నాం – ఇస్రో ఛైర్మన్
