YS Sharmila KTR : ఖాకీలు లేకుండా కేటీఆర్ రాగలవా – షర్మిల
నిప్పులు చెరిగిన వైఎస్సార్టీపీ చీఫ్
YS Sharmila KTR : వైఎస్సార్ తెలంగాణ పార్టీ చీఫ్ వైఎస్ షర్మిల సంచలన కామెంట్స్ చేశారు. బుధవారం ఆమె ట్విట్టర్ వేదికగా తీవ్రంగా స్పందించారు. నిన్నటి దాకా సీఎం కేసీఆర్ ను లక్ష్యంగా చేసుకుని వ్యాఖ్యలు చేస్తే ఇవాళ మాత్రం ఆయన తనయుడు, ఐటీ, పురపాలిక, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ను ఏకి పారేశారు. అసలు పోలీసుల రక్షణ లేకుండా నువ్వు బయటకు రాగలవా అంటూ ప్రశ్నించారు.
ఇవాళ కోరి తెచ్చుకున్న తెలంగాణలో ప్రజలు నానా రకాలుగా ఇబ్బందులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రశ్నించే అవకాశం లేకుండా చేశారని, ఎవరైనా అక్రమాలను, అవినీతిని నిలదీస్తే వెంటనే కేసులు నమోదు చేయడం, అరెస్ట్ చేయడం, ఆపై థర్డ్ డిగ్రీ ప్రయోగించడం అలవాటుగా మారిందని ఆరోపించారు షర్మిల.
చిన్న దొర కేటీఆర్ తాను పోలీసులను అడ్డు పెట్టు కోవడం లేదంటూ చెప్పడం దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందంటూ ఎద్దేవా చేశారు. డబ్బులు, మద్యాన్ని పంపిణీ చేయకుండా ఎలా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గెలిచారంటూ ప్రశ్నించారు. ఒక రకంగా చూస్తే ఈ దశాబ్దపు అతి పెద్ద జోక్ ఏమిటంటే కేటీఆర్ చెప్పిన మాటలేనని పేర్కొన్నారు వైఎస్ షర్మిల(YS Sharmila).
ఆయన ఎక్కడికి వెళ్లినా పోలీసుల రక్షణ లేనిదే బయటకు రాడని పేర్కొన్నారు. కేటీఆర్ టూర్ ఉందంటే ముందస్తు అరెస్ట్ లు సర్వ సాధారణమని మండిపడ్డారు. అన్నం పెట్టే రైతులకు బేడీలు వేసిన ఘనత మీ ప్రభుత్వానిదంటూ ఆగ్రహం వ్యకత్ం చేశారు షర్మిల.
Also Read : Priyank Kharge : ఫ్యాక్ట్ చెక్ సెల్ ఏర్పాటు – ప్రియాంక్ ఖర్గే