Canada Says : భార‌త్ కు వెళ్లే ముందు జాగ్ర‌త్త – కెన‌డా

కెనడా పౌరుల‌కు స‌ర్కార్ వార్నింగ్

Canada Says : కెన‌డా ప్ర‌భుత్వం కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. పాకిస్తాన్ స‌రిహద్దు లోని భార‌తీయ రాష్ట్రాల‌కు వెళ్ల వ‌ద్దంటూ హెచ్చ‌రించింది. ఉగ్ర‌వాదం, తిరుగుబాటు ప్ర‌మాదం కార‌ణంగా అస్సాం, మ‌ణిపూర్ ల‌కు అన‌వ‌స‌ర‌మైన ప్ర‌యాణాల‌ను నివారించాల‌ని కోరింది. ఈ స‌ల‌హా కేంద్ర పాలిత ప్రాంతం ల‌డ‌ఖ్ కు లేదా దాని లోప‌ట ప్ర‌యాణాన్ని మిన‌హాయిస్తుంది.

ల్యాండ్ మైన్ ల ఉనికి, అనూహ్య భ‌ద్ర‌తా లోపం కార‌ణంగా పాకిస్తాన్ తో స‌రిహ‌ద్దును పంచుకునే గుజ‌రాత్, పంజాబ్ , రాజ‌స్థాన్ రాష్ట్రాల్లోని ప్రాంతాల‌కు కెన‌డా నుంచి వెళ్లే వారు త‌మ ప్ర‌యాణాల‌ను విర‌మించు కోవాల‌ని సూచించింది కెనెడా ప్ర‌భ‌త్వం(Canada Says).

సెక్యూరిటీ ఇబ్బంది, మందు పాత‌ర‌లు , పేల‌ని ఆయుధాల కార‌ణంగా పాకిస్తాన్ స‌రిహ‌ద్దు 10 కిలోమీట‌ర్ల లోపట ఉన్న ప్రాంతాల‌కు వెళ్లేందుకు ప్లాన్ చేసుకున్న వారు ముందస్తుగా త‌మ జ‌ర్నీని విర‌మించుకుంటే మంచిద‌ని స‌ల‌హా ఇచ్చింది ప్ర‌భుత్వం.

దేశ‌మంత‌టా తీవ్ర‌వాద దాడుల ముప్పు పొంచింద‌ని త‌గు జాగ్ర‌త్తలు పౌరులు తీసుకోవాల‌ని స్ప‌ష్టం చేసింది. ఉగ్ర‌వాదం, తిరుగుబాటు ప్ర‌మాదం కార‌ణంగా అస్సాం, మ‌ణిపూర్ ల‌కు అన‌వ‌స‌ర‌మైన ప్ర‌యాణాల‌ను నిలుపుద‌ల చేసుకోవాల‌ని కోరింది కెన‌డా ప్ర‌భుత్వం.

దేశంలో పెరుగుతున్న నేరాలు, భార‌త వ్య‌తిరేక కార్య‌క‌లాపాల మ‌ధ్య కెన‌డా(Canada Says) లోని భార‌తీయ పౌరులు , విద్యార్థులు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని స్ప‌ష్టం చేసింది.

కెన‌డాలో ద్వేష పూరిత నేరాలు, మ‌త ప‌ర‌మైన హింస , భార‌త వ్య‌తిరేక కార్య‌క‌లాపాల సంఘ‌ట‌నలు గ‌ణ‌నీయంగా పెరిగాయి. విదేశాంగ మంత్రిత్వ శాఖ‌, కెన‌డాలోని హై క‌మిష‌న్ కాన్సులేట్ జ‌న‌ర‌ల్ ఈ సంఘ‌ట‌న‌ల గురించి ఇప్ప‌టికే భార‌త్ తెలియ చేసింది.

Also Read : అంకితా ఫ్యామిలీకి రూ. 25 లక్ష‌ల ఎక్స్ గ్రేషియా

Leave A Reply

Your Email Id will not be published!