Maharashtra Cancels : జాన్సన్ బేబీ పౌడర్ లైసెన్స్ రద్దు
మహారాష్ట్ర సర్కార్ కీలక నిర్ణయం
Maharashtra Cancels : జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీకి కోలుకోలేని షాక్ తగిలింది. కంపెనీ ద్వారా తయారైన జాన్సన్ బేబీ పౌడర్ కు సంబంధించిన లైసెన్సును రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది మహారాష్ట్ర సర్కార్.
దీంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో కంపెనీ కోర్టును ఆశ్రయించింది. సెంట్రల్ డ్రగ్స్ లాబొరేటరీకి పంపించడాన్ని తీవ్రంగా తప్పు పట్టింది.
ఇదిలా ఉండగా ఇంకా జాన్సన్ అండ్ జాన్సన్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ నుండి ఎలాంటి స్పందన రాలేదు. మహారాష్ట్ర లోని ఫుడ్ అండ్ డ్రగ్స్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్‌డీఏ)(Maharashtra Cancels) కీలక నిర్ణయం తీసుకుంది.
జాన్సన్ అండ్ జాన్సన్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ తయారు చేస్తున్న బేబీ పౌండర్ తయారీ లైసెన్స్ ను విస్తారంగా ప్రజా రోగ్య ప్రయోజనాల దృష్ట్యా రద్దు చేస్తున్నట్లు స్పష్టం చేసింది.
దీని తయారీలో రసాయనాలు కలుపుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయని వెంటనే పౌడర్ ను నిలిపి వేయాలని కోరుతూ
లైసెన్స్ ను రద్దు(Maharashtra Cancels) చేస్తూ నిర్ణయం తీసుకున్నట్లు ఎఫ్‌డీఏ స్పష్టం చేసింది.
ఈ మేరకు కీలక ప్రకటన విడుదల చేసింది. కంపెనీకి సంబంధించిన ఉత్పత్తి జాన్సన్ బేబీ పౌడర్ నవజాత శిశువుల చర్మంపై తీవ్ర ప్రభావం చూపుతుందని పేర్కొంది.
ప్రయోగశాల పరీక్షలో శిశువులకు పౌడర్ కు సంబంధించిన నమూనాలు ప్రామాణిక పీహెచ్ విలువకు అనుగుణంగా లేవని ఎఫ్‌డీఏ ఆరోపించింది.
కోల్ కతాకు చెందిన సెంట్రల్ డ్రగ్ లాబొరేటరీ నిశ్చయాత్మక నివేదిక ప్రకారం జాన్సన్ అండ్ జాన్సన్ బేబీ పౌడర్ తయారీ లైసెన్స్ ను రద్దు చేసినట్లు ప్రకటించింది.
Also Read : గుజరాత్ పాకిస్తాన్ కాదు – ఫడ్నవీస్