Sundar Pichai CEO : ఉద్యోగుల తొలగింపుపై చెప్పలేం – పిచాయ్
గూగుల్ సిఇఓ సంచలన కామెంట్స్
Sundar Pichai CEO : గూగుల్ సిఇఓ సుందర్ పిచాయ్ షాకింగ్ కామెంట్స్ చేశారు. గూగుల్ మాతృ సంస్థ ఆల్ఫా బెట్ తో పాటు యూట్యూబ్ , గూగుల్ సంస్థలో 10 వేల మందికి పైగా ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించడంపై పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం అవుతోంది. సుందర్ పిచాయ్ భారత దేశంలో పర్యటిస్తున్నారు.
ఆయన స్వస్థలం తమిళనాడు. ఈ సందర్భంగా ఉద్యోగులు తమ జాబ్స్ ఉంటాయో ఉండవోనన్న ఆందోళన నెలకొన్న తరుణంలో రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో చెప్పలేమన్నారు సిఇఓ(Sundar Pichai CEO). భవిష్యత్తును ఇప్పుడే అంచనా వేయడం కష్టమన్నారు. గత వారం భారీ ఎత్తున ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించింది.
ఇదే సమయంలో ట్విట్టర్ బాస్ ఎలాన్ మస్క్ 9 వేల మందికి పైగా తొలగించారు. ఇక ఫేస్ బుక్ సిఇఓ మార్క్ జుకర్ బర్గ్ 10 వేల మందికి ఎసరు పెట్టారు. ఇక అమెజాన్ లో 20 వేల మందికి పైగా మంగళం పాడారు. పలు దిగ్గజ కంపెనీలు కాస్ట్ కటింగ్ పేరుతో ఉద్యోగులను సాగనంపే ప్రయత్నం చేస్తున్నాయి.
గత రెండు నెలలుగా ఇదే తంతు కొనసాగుతోంది. ఈ తరుణంలో తమ ఉద్యోగులకు కోలుకోలేని షాక్ ఇచ్చారు గూగుల్ సిఇఓ సుందర్ పిచాయ్. సంస్థ ఉద్యోగులతో సమావేశమైన సందర్భంగా సుందర్ పిచాయ్(Sundar Pichai CEO) కీలక ప్రకటన చేశారు. దీనిపై పెద్ద ఎత్తున చర్చ జరిగింది.
ఈ ఏడాది చివరి నాటికి ఉద్యోగులు మరింత సమర్థవంతంగా పని చేయాలని సూచించాడు సిఇఓ. కీలకమైన జాబ్స్ తప్ప ఇతర ఉద్యోగాలను భర్తీ చేయబోమంటూ ప్రకటించడం కలకం రేపింది.
Also Read : భారత్ లో సాంకేతిక పురోగతి సూపర్