Keshav Murthy Case : హిందూ జాగరణ్ వేదిక కన్వీనర్ పై కేసు
మహ్మద్ ప్రవక్త ఖురాన్ పై కామెంట్స్
Keshav Murthy Case : దేశంలో ద్వేష పూరిత ప్రసంగాలతో దద్దరిల్లుతోంది. భారతీయ జనతా పార్టీకి చెందిన బహిష్కృత నేత నూపుర్ శర్మ ప్రవక్త మహ్మద్ పై చేసిన కామెంట్స్ వేడి ఇంకా చల్లార లేదు.
ఇదే సమయంలో మరో హిందూత్వ పార్టీ అనుబంధ సంస్థకు చెందిన నేత వివాదాస్పద కామెంట్ చేయడం కలకలం రేపింది. ఈ సంఘటన కర్ణాటక రాష్ట్రంలో చోటు చేసుకుంది.
ఇదిలా ఉండగా రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ లో టైలర్ కన్హయ్య లాల్ హత్యను నిరసిస్తూ కొంత మంది కోలార్ లో చేసిన ప్రసంగం వైరల్ గా మారింది.
ఈ సందర్భంగా జరిగిన మీటింగ్ లో హిందూ జాగరణ్ వేదిక రాష్ట్ర కన్వీనర్ కేశవ మూర్తి సంచలన కామెంట్స్ చేశారు. ఆయన చేసిన కామెంట్స్ కలకలం రేపాయి.
ఖురాన్ , ముస్లింలను కించ పరిచేలా వ్యాఖ్యలు చేసినందుకు గాను కోలార్ పోలీసులు కేశవ మూర్తితో పాటు ఇతరులపై కేసు నమోదు చేశారు. ఇదిలా ఉండగా అంజుమన్ – ఎ – ఇస్లామియా సంస్థ చీఫ్ జమీర్ అహ్మద్ పోలీసులకు కేశవమూర్తి(Keshav Murthy Case), ఇతరులపై ఫిర్యాదు చేశారు.
ఆ మేరకు కేసు నమోదైంది. ప్రస్తుతం ఇది రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారింది. ఖురాన్ ప్రజలను చంపండి అని చెబుతుంది కాబట్టి ఖురాన్ చదివే వారు దానిని అనుసరిస్తారని మీరు అనుకోలేదా అని కేశవ మూర్తి తన ప్రసంగంలో పేర్కొన్నారు.
ఖురాన్ ను చదివిన వారు తీవ్రవాదులంటూ సంచలన కామెంట్స్ చేశారు. కేశవ మూర్తిపై భారతీయ శిక్షా స్మృతి సెక్షన్లు 153ఎ, 295ఎ, 153బి కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
Also Read : కావాలని రాద్దాంతం మోయిత్రా ఆగ్రహం