Channi Moosewala : పంజాబ్ లో కొద్ది గంటల్లో పోలింగ్ జరుగుతున్న సమయంలో సీఎం చన్నీకి కోలుకోలేని షాక్ తగిలింది. ఆయనతో పాటు ప్రముఖ గాయకుడు, ఇటీవల కాంగ్రెస్ లో చేరి ఎన్నికల బరిలోకి దిగిన సిద్దూ మూసేవాలాపై కేసు నమోదైంది.
సిద్దూ మానస నుంచి పోటీ చేస్తున్నారు. ఇప్పటికే పంజాబీ గాయకుడిగా దేశ వ్యాప్తంగా పేరు పొందారు. ఇప్పటికే మంచి పొజిషన్ లో ఉన్నాడు.
ప్రస్తుతం తన భవిష్యత్తు కోసం వెయిట్ చేస్తున్నాడు. పంజాబ్ లో సిద్దూ మూసేవాలా మోస్ట్ పాపులర్ సింగర్ గా పేరొందారు.
అతడిని పీసీసీ చీఫ్ సిద్దూ తీసుకు వచ్చాడు. తాజాగా సీఎం చరణ్ జిత్ సింగ్ చన్నీతో పాటు సిద్దూ మూసేవాలాతో మరికొందరు కలిసి ఎన్నికల కోడ్ ఉల్లంఘించారు. సీఎం చన్నీతో పాటు సిద్దూ కలిసి ఆలయాన్ని సందర్శించారు.
ఈనెల 20న రాష్ట్రంలో ఒకే సారి 117 అసెంబ్లీ నియోజకవర్గాలలో పోలింగ్ జరగనుంది. ఇప్పటికే జాతీయ ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేసింది. ఆలయాన్ని దర్శించు కోవడం చర్చనీయాంశంగా మారింది.
ఎన్నికల వేళ నియమ నిబంధనలు కఠినంగా ఉంటాయి. ఒక బాధ్యత కలిగిన సీఎం ఇలా వ్యవహరిస్తే ఎలా అని ప్రతిపక్షాలు ఆరోపించాయి.
దీంతో సీఎం చన్నీతో పాటు గాయకుడు శుభదీప్ సింగ్ సిద్దూ ఆకా సిద్దూ మూసేవాలాపై కేసు నమోదు చేశారు. ఆ తర్వాత ఇంటింటి ప్రచారం చేయడం కూడా చర్చకు దారి తీసింది.
కేసు నమోదు చేయడంపై కాంగ్రెస్ శ్రేణులు తీవ్రంగా తప్ప పడుతున్నాయి.
Also Read : స్టాలిన్ పని తీరుకు రెఫరెండం