Samajwadi Party: సమాజ్‌వాదీ నేతలపై కేసు నమోదు చేసిన యూపీ పోలీసులు

సమాజ్‌వాదీ నేతలపై కేసు నమోదు చేసిన యూపీ పోలీసులు

Samajwadi Party : సాధారణంగా ఏ పాఠశాలల్లో అయినా విద్యార్థులకు ‘ఏ ఫర్‌ ఆపిల్‌, బీ ఫర్‌ బాల్‌’ అని బోధిస్తుంటారు. కానీ ఉత్తరప్రదేశ్‌ లోని ‘పీడీఏ పాఠశాలల్లో’ మాత్రం ఏ ఫర్‌ అఖిలేశ్‌, బీ ఫర్‌ బాబా సాహెబ్‌ అంబేడ్కర్‌, డి ఫర్‌ డింపుల్, ఎం ఫర్‌ ములాయం సింగ్‌ యాదవ్‌’ అంటూ బోధించడం గమనార్హం. అసలేమయ్యిందంటే ఉత్తరప్రదేశ్‌, సహారన్‌పుర్‌లోని కొన్ని ప్రాంతాల్లో బీజేపీ ప్రభుత్వం పలు ప్రభుత్వ పాఠశాలలను మూసివేంది. ప్రభుత్వ చర్యలను వ్యతిరేకిస్తూ… ఆ ప్రాంతాల్లో ప్రతిపక్ష సమాజ్‌వాదీ పార్టీ నేతలు ‘పీడీఏ పాఠశాలలు’ ఏర్పాటుచేశారు.

UP Police Filed Case – Samajwadi Party

స్థానిక సమాజ్‌వాదీ పార్టీ (Samajwadi Party) నేత ఫర్హాద్ ఆలం గడా ఆ పాఠశాలల్లో విద్యార్థులకు ‘ఏ ఫర్‌ అఖిలేశ్‌, బి ఫర్‌ బాబా సాహెబ్‌ అంబేడ్కర్‌, డి ఫర్‌ డింపుల్, ఎం ఫర్‌ ములాయం సింగ్‌ యాదవ్‌’ అని బోధిస్తున్నట్లు విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. పాఠశాలలో అక్షరాలను రాజకీయాల కోసం వినియోగిస్తున్నారంటూ వారు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఆయా పాఠశాలల యాజమాన్యంపై కేసు నమోదు చేసి… దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. వారు పిల్లలకు బోధిస్తున్న పాఠాలకు సంబంధించిన ఓ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

దీనిపై అఖిలేశ్‌ యాదవ్‌ స్పందిస్తూ… విద్యార్థులకు చదువు చెప్పడంపై బ్రిటిషు వారు పాలించిన సమయంలో కూడా ఎఫ్‌ఐఆర్‌ నమోదు కాలేదని అన్నారు. తమపై తప్పుడు ఆరోపణలు చేస్తూ… తాము నడిపిన పాఠశాలలను మూసివేయించడానికి ఇది బీజేపీ ప్రభుత్వం పన్నిన కుట్ర అని అన్నారు. ఈ చర్యలతో విద్యకు బీజేపీ ఎంత వ్యతిరేకమో ప్రజలకు అర్థమవుతోందని దుయ్యబట్టారు. తమ పాఠశాలల్లో విద్యతో పాటు సమాజ్‌వాదీ పార్టీకి చెందిన గొప్ప వ్యక్తుల గురించి అవగాహన కల్పిస్తున్నట్లు పార్టీ నేత ఫర్హాద్ ఆలం గడా పేర్కొన్నారు. భాజపా తమపై తప్పుడు కేసులు పెట్టడంతో భయపడి ఆగిపోమని.. జిల్లావ్యాప్తంగా ఇటువంటి పాఠశాలలు మరిన్ని ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తామని అన్నారు.

Also Read : Supreme Court: రాహుల్‌ గాంధీ పై సుప్రీం కోర్టు ఆగ్రహం

Leave A Reply

Your Email Id will not be published!