Kamal Haasan : కులమే నాకు రాజకీయ ప్రత్యర్థి – కమల్
సంచలన కామెంట్స్ చేసిన లోకనాయకుడు
Kamal Haasan : ప్రముఖ నటుడు లోక నాయకుడిగా వినుతికెక్కిన కమల్ హాసన్ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆయన కులంపై కీలక వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. చాలా మంది ఎన్నో సార్లు నన్ను అడుగుతూ వస్తున్నారు. మీరు రాజకీయాల్లోకి వచ్చారు.
సినిమా రంగంలో ఉన్నారు. ఎంతో గొప్ప పేరు తెచ్చుకున్నారు. అసలు మీకు నిజమైన ప్రత్యర్థి ఎవరు అని. ఇవాళ చెబుతున్నాను..నా రాజకీయ ప్రత్యర్థి ఎవరో కాదు కులం అని కుండ బద్దలు కొట్టారు కమల్ హాసన్(Kamal Haasan).
ఇదిలా ఉండగా ఆదివారం తమిళ సినిమా రంగంలో ప్రముఖ దర్శకుడిగా పేరొందిన పా రంజిత్ తన నీలం కల్చరల్ సెంటర్ లో భాగంగా నీలం బుక్స్ ని ప్రారంభంచారు మక్కల్ నీది మయ్యం (ఎంఎన్ఎం) చీఫ్, నటుడు కమల్ హాసన్. ఈ విషయంలో తన అభిప్రాయం ఎప్పుడూ మారదని స్పష్టం చేశారు.
అవును ఇది నిజం. ఇది నేను 21 ఏళ్ల వయస్సు నుండి చెబుతున్నాను. ఇప్పటికీ ఇదే చెబుతూ వస్తున్నానని అన్నారు దిగ్గజ నటుడు. చక్రం తర్వాత మనిషి సృష్టించిన గొప్ప సృష్టి భగవంతుడు. మన స్వంత సృష్టి మనపై దాడి చేస్తే మనం అంగీకరించ లేమని పేర్కొన్నారు కమల్ హాసన్.
విమర్శలకు ప్రశంసలు పొందిన సినిమాలకు పేరొందారు దర్శకుడు పా రంజిత్. ఆర్ట్ ఫిల్మ్ ను రూపొందించే ఫార్ములాను పండించిన వ్యక్తి. దానిని ప్రధాన స్రవంతి ప్రేక్షకులకు అందించడంలో సక్సెస్ అయ్యాడంటూ కొనియాడారు. పా రంజిత్ మాట్లాడుతూ ప్రధాన స్రవంతి సాహిత్య ,రాజకీయేతర పుస్తకాలు కాకుండా అందరికీ అర్థం అయ్యేలా ఉండేలా ఉంచినట్లు పేర్కొన్నారు.
Also Read : రోడ్లు అధ్వాన్నం కేంద్రం కారణం