UP CM Yogi : కుల రాజ‌కీయాలు చెల్ల‌వు – యోగి

నిప్పులు చెరిగిన యూపీ సీఎం

UP CM Yogi : యూపీలో గ‌తంలో కుల ప్రాతిప‌దిక‌న రాజ‌కీయాలు కొన‌సాగాయ‌ని కానీ ఇప్పుడు ఆ ప‌రిస్థితి లేద‌న్నారు సీఎం యోగి ఆదిత్యా నాథ్. వ్య‌వ‌స్థ‌ల‌ను ప‌క్క‌దారి ప‌ట్టించి కేవ‌లం త‌మ స్వార్థం కోస‌మే పార్టీల‌ను కొన‌సాగించార‌ని ఆరోపించారు. తాము ప‌వ‌ర్ లోకి వ‌చ్చాక అన్ని వ్య‌వ‌స్థ‌ల‌ను గాడిలో పెట్టేందుకు ప్ర‌య‌త్నం చేశామని చెప్పారు.

రాష్ట్రానికి రావాలంటే పారిశ్రామిక‌వేత్త‌లు, పెట్టుబ‌డిదారులు, కంపెనీల చీఫ్ లు భ‌య‌ప‌డే వార‌ని కానీ ఇప్పుడు ఆ సీన్ లేద‌న్నారు. మాఫీయా డాన్ లు , గ్యాంగ్ స్ట‌ర్లు , నేర‌స్థులు బ‌య‌ట‌కు రావాలంటే జ‌డుసు కుంటున్నార‌ని , ప్యాంట్లు త‌డిసి పోతున్నాయ‌ని ఎద్దేవా చేశారు.

రాష్ట్రంలో ఎవ‌రైనా స‌రే ఏ స్థాయిలో ఉన్న వారైనా స‌రే నేరానికి పాల్ప‌డినా లేదా అవినీతి, అక్ర‌మాల‌ను ప్రోత్స‌హించినా ఊరుకునే ప్ర‌సక్తి లేద‌ని హెచ్చ‌రించారు సీఎం యోగి ఆదిత్యానాథ్(UP CM Yogi) . అభివృద్దే ఎజెండాగా ముందుకు సాగుతున్నామ‌ని చెప్పారు. ఆదివారం యూపీలో జ‌రిగిన స‌భ‌లో సీఎం ప్ర‌సంగించారు.

నేర‌స్థుల‌పై , అక్ర‌మార్కుల‌పై ఉక్కు పాదం మోపామ‌న్నారు. అందుకే బుల్ డోజ‌ర్ల‌ను తీసుకు వ‌చ్చామ‌న్నారు. ఎవ‌రు ఎన్ని ర‌కాలుగా ఆరోప‌ణ‌లు చేసినా తాము ఊరుకునే ప్ర‌స‌క్తి లేద‌న్నారు. స్వ‌ప్ర‌యోజ‌నాల‌కు రాజ‌కీయాలు వాడుకుంటే ఒప్పుకునేది లేద‌న్నారు. ఇక కుల రాజ‌కీయాలు ఇక చెల్ల‌వ‌న్నారు సీఎం.

Also Read : ఇంకేం ఉంది దోచుకునేందుకు

Leave A Reply

Your Email Id will not be published!