Shashi Tharoor : కుల వ్యవస్థ దేశానికి అవస్థ – శశి థరూర్
సంచలన కామెంట్స్ చేసిన ఎంపీ
Shashi Tharoor : కాంగ్రెస్ అగ్ర నాయకుడు, తిరువనంతపురం ఎంపీ శశి థరూర్(Shashi Tharoor) షాకింగ్ కామెంట్స్ చేశారు. ఈ దేశంలో కుల వ్యవస్థ ఇంకా మారలేదన్నారు. శనివారం ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. 1950లో నాటి కంటే ప్రస్తుతం అంటే 2022లో కుల స్పృహ ఎక్కువగా ఉందన్నారు.
డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ , జవహర్ లాల్ నెహ్రూ భారత దేశం నుండి కుల వ్యవస్థ అంతరించి పోవాలని కోరుకున్నారు. రాను రాను ఆధునికీకరణతో అది కనుమరుగవుతుందని భావించారని పేర్కొన్నారు. ఈ వ్యవస్థను ఇప్పుడు మార్చడం కష్టమేనని అభిప్రాయపడ్డారు.
ప్రస్తుతం దేశం కుల వ్యవస్థ నిర్మూలనకు దూరంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే భారతీయ సమాజంలో కులం పట్ల స్పృహ ఎక్కువగా ఉందని ఎంపీ, రచయిత శశి థరూర్ సంచలన ప్రకటన చేశారు. ఆయన ముంబైలో ఈ విషయంపై ప్రత్యేకంగా ప్రస్తావించారు.
టాటా లిటరేచర్ ఫెస్టివల్ లో ది లాస్ట్ లెగసీ ఆఫ్ అంబేద్కర్ అనే అంశంపై జరిగిన చర్చలో శశి థరూర్(Shashi Tharoor) మాట్లాడారు. ఇప్పుడు ప్రతి కులం తన గుర్తింపు గురించి స్పృహలో ఉందన్నారు.
ఈ ఐడెంటిటీ లేబుల్ రాజకీయ సమీకరణకు గుర్తుగా మారిందన్నారు. ఈ కార్యక్రమంలో శశి థరూర్ రాసిన అంబేద్కర్ ఎ లైఫ్ పుస్తకాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జీవిత చరిత్రను ఆవిష్కరించారు.
అంబేద్కర్ కుల వ్యవస్థను పూర్తిగా నాశనం చేయాలని అనుకున్నాడు. ఏదైనా ఉంటే రాజకీయ పార్టీలలో కుల వ్యవస్థ మరింతగా వేళ్లూనుకుందని గ్రహించి ఆయన భయపడి ఉంటాడని పేర్కొన్నారు శశి థరూర్.
Also Read : వెంకీ రామకృష్ణన్ కు ఆర్డర్ ఆఫ్ మెరిట్