CBI: సీబీఐ వలకు చిక్కిన బీఐఎస్ జాయింట్ డైరెక్టర్ రమాకాంత్ సాగర్
సీబీఐ వలకు చిక్కిన బీఐఎస్ జాయింట్ డైరెక్టర్ రమాకాంత్ సాగర్
CBI : సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) వలకు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బీఐఎస్) జాయింట్ డైరెక్టర్ రమాకాంత్ సాగర్ చిక్కారు. సిలిండర్ కు బీఐఎస్ మార్క్ కోసం రూ.70వేలు లంచం తీసుకుంటూ సీబీఐ అధికారులకు అడ్డంగా దొరికిపోయారు. రమాకాంత్ సాగర్ తో పాటు వి. లక్ష్మీనారాయణ, వైఎస్ మనోహర్ అనే మరో ఇద్దరు ప్రైవేటు ఏజెన్సీ వ్యక్తులను కూడా లంచం తీసుకుంటుండగా సీబీఐ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఇక పూర్తి వివరాల్లోకి వెళితే…
CBI Ex Director Ramakanth
సిలిండర్ కు బీఐఎస్ మార్క్ కోసం ఓ తయారీ కంపెనీ దరఖాస్తు చేసుకోగా… దానిని మంజూరు చేయడానికి రమాకాంత్ లంచం డిమాండ్ చేశారు. దీనితో ఆ కంపెనీ ప్రతినిధులు అతడిపై సీబీఐ అధికారులకు ఫిర్యాదు చేశారు. దీనితో రంగంలోకి దిగిన సీబీఐ పక్కా ప్రణాళిక ప్రకారం… అతడిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. రమాకాంత్‌తోపాటు ఈ కేసుతో సంబంధం ఉన్న లక్ష్మీనారాయణ రెడ్డి వైఎస్ మనోహర్ అనే మరో ఇద్దరు ప్రైవేటు వ్యక్తులను కూడా సీబీఐ అధికారులు అరెస్టు చేశారు. వీరిని సోమవారం విజయవాడ సీబీఐ కోర్టులో హాజరుపరచనున్నారు.
Also Read : CM Chandrababu Naidu: పేదరికం లేని సమాజం కోసమే P4 విధానం – సీఎం చంద్రబాబు