Manish Sisodia : సిసోడియా బెయిల్ పై విచార‌ణ

లిక్క‌ర్ స్కాం కేసులో అరెస్ట్

Manish Sisodia Bail Petition : ఢిల్లీ లిక్క‌ర్ స్కాం కేసులో అరెస్ట్ అయిన మాజీ ఢిల్లీ డిప్యూటీ సీఎం మ‌నీష్ సిసోడియా ను శ‌నివారం సీబీఐ కోర్టులో హాజ‌రు ప‌ర్చ‌నున్నారు. త‌న‌కు బెయిల్ ఇవ్వాల‌ని కోరుతూ ఆయ‌న పిటిష‌న్ దాఖ‌లు చేశారు.

ఇప్ప‌టికే ఆయ‌న సుప్రీంకోర్టును ఆశ్ర‌యించారు. స‌ర్వోన్న‌త న్యాయ‌స్థానం సిసోడియా బెయిల్ పిటిష‌న్ (Manish Sisodia Bail Petition) ను కొట్టి పారేసింది. ఈ సంద‌ర్భంగా కీల‌క వ్యాఖ్య‌లు చేసింది. అవినీతి, అక్ర‌మాల‌కు సంబంధించిన కేసుతో సంబంధం ఉంద‌ని, దీనిని తాము విచార‌ణ చేప‌ట్ట లేమ‌ని స్ప‌ష్టం చేసింది.

ఈ కేసును స‌ర్వోన్న‌త ప్ర‌ధాన న్యాయ‌మూర్తి జ‌స్టిస్ ధ‌నంజ‌య వై చంద్ర‌చూడ్ ఆధ్వ‌ర్యంలోని ధ‌ర్మాస‌నం తీర్పు చెప్పింది. ఢిల్లీ హైకోర్టును ఆశ్ర‌యించాల‌ని సూచించింది. మ‌ద్యం కుంభ‌కోణం కేసుకు సంబంధించి ఇప్ప‌టికే సీబీఐ మ‌నీష్ సిసోడియాను(Manish Sisodia) అరెస్ట్ చేసింది.

సీబీఐ కోర్టులో హాజ‌రు ప‌రిచింది. 10 రోజుల పాటు క‌స్ట‌డీకి ఇవ్వాల‌ని కోరింది కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ సీబీఐ. దీనికి కోర్టు ఒప్పుకోలేదు. కేవ‌లం 5 రోజుల పాటు క‌స్ట‌డీకి ఇచ్చింది.

ఇదిలా ఉండ‌గా మ‌ద్యం పాల‌సీని రూపొందించ‌డంలో మాజీ డిప్యూటీ సీఎం కీల‌క పాత్ర పోషించాడ‌ని ఆరోపించింది. ఈ కేసుకు సంబంధించి మొత్తం 34 మందిపై కేసు న‌మోదు చేసింది. ఇందులో ఇప్ప‌టి వ‌ర‌కు 10 మందిని అరెస్ట్ చేసింది.

ఇదిలా ఉండ‌గా 2021-22కి సంబంధించి ఇప్పుడు ర‌ద్దు చేసిన మ‌ద్యం పాల‌సీని రూపొందించ‌డంలో , అమ‌లు చేయ‌డంలో భారీ ఎత్తున అవినీతి చోటు చేసుకుంద‌ని ఆరోపించింది కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ‌. ఇక ఆప్ కు చెందిన మ‌రో మంత్రి స‌త్యేంద్ర జైన్ తీహార్ జైలులో ఉన్నాడు.

Also Read : మేఘాల‌య ప్ర‌భుత్వ ఏర్పాటులో ట్విస్ట్

Leave A Reply

Your Email Id will not be published!