YS Jagan: జగన్ యూరప్ పర్యటనకు సీబీఐ కోర్టు అనుమతి
జగన్ యూరప్ పర్యటనకు సీబీఐ కోర్టు అనుమతి
YS Jagan : యూరప్ పర్యటనకు అనుమతి ఇవ్వాలని మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి (YS Jagan) సీబీఐ కోర్టులో మరోసారి పిటిషన్ దాఖలు చేశారు. అక్టోబర్ నెలలో 1 నుంచి 30 తేదీలోపు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని కోర్టును కోరారు. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం…. అక్టోబర్ నెలలో 15 రోజుల్లో యూరప్ పర్యటనకు అనుమతి ఇచ్చింది. అలాగే… యూరప్ పర్యటన తరువాత సీబీఐ కోర్ట్ ముందు వ్యక్తిగతంగా హాజరు కావాలని ఆదేశించింది. నవంబర్ 1 నుంచి 14 లోపు కచ్చితంగా వ్యక్తగతంగా సీబీఐ కోర్ట్ ముందు హాజరు కావాలని తేల్చి చెప్పింది. చాలా ఏళ్ల తరువాత జగన్‌ను వ్యక్తిగతంగా విచారణకు రావాలని సీబీఐ కోర్టు ఆదేశించడం చర్చనీయాంశంగా మారింది.
గతేడాది ఎన్నికల అనంతరం తన పిల్లల ఉన్నత చదువుల కోసం యూరప్ వెళ్లేందుకు అనుమతి కోరుతూ సీబీఐ కోర్టులో జగన్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే అప్పుడు కోర్టు అనుమతికి నిరాకరించడంతో పర్యటన వాయిదా పడింది. దీనితో జగన్ తాజాగా మరోసారి పిటిషన్ దాఖలు చేసుకున్నారు. ఈ మేరకు విచారణ చేపట్టిన సీబీఐ కోర్టు పర్యటనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
YS Jagan – సోషల్ మీడియా యాక్టివిస్ట్ సాయి భార్గవ్ అరెస్ట్ చేసిన సీఐడీ
యూరియా అంశానికి సంబంధించి సీఎం చంద్రబాబు నాయుడు (CM Chandrababu) చేసిన వ్యాఖ్యలను మార్చి సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడనే అభియోగంపై సోషల్ మీడియా యాక్టివిస్ట్ సాయి భార్గవ్‌ను సీఐడీ పోలీసులు అరెస్ట్ చేశారు. నేరాలు ,దోపిడీలు, దొమ్మీలు, కిడ్నాప్ లు చేసే వ్యక్తులపై పెట్టే 111 (3)(4)(5)సెక్షన్‌ను సాయి భార్గవ్‌పై పెట్టారు. అనంతరం సాయి భార్గవ్‌ను సీఐడీ కోర్టులో ప్రవేశపెట్టారు పోలీసులు.
సోషల్ మీడియా కేసులో 111(3)(4)(5) సెక్షన్ వర్తించదని వాదనను వినిపించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ ప్రతినిధులు. విచారణ సందర్భంగా సిఐడి పోలీసులు తనను కొట్టారని న్యాయమూర్తికి తెలిపిన సాయి భార్గవ్. ఇన్ కెమెరా ప్రొసీడింగిడ్స్ తో సాయి భార్గవ్ స్టేట్మెంట్ను రికార్డు చేశారు. సిఐడి పోలీసులు తనను కొట్టారని సాయి భార్గవ్ న్యాయమూర్తి ముందు ఇచ్చిన వాంగ్మూలంపై అతన్ని వైద్య పరీక్షల కోసం న్యాయవాది సమక్షంలో గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లాల్సిందిగా న్యాయమూర్తి ఆదేశించారు.
Also Read : CM Chandrababu: విద్యార్థులకు టీచర్లు నైతిక విలువలు బోధించాలి – సీఎం చంద్రబాబు
