MLC Kavitha CBI : లిక్క‌ర్ స్కాంలో క‌విత‌కు నోటీసులు

6న హాజ‌రు కావాల‌ని సీబీఐ ఆదేశం

MLC Kavitha CBI : దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నం రేపిన ఢిల్లీ లిక్క‌ర్ స్కాం కేసులో అంతా ఊహించిన‌ట్టుగానే సీఎం కేసీఆర్ ముద్దుల కూతురు ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత‌కు(MLC Kavitha CBI)  కోలుకోలేని షాక్ త‌గిలింది. కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ‌లు ఇప్ప‌టికే త‌మ దూకుడు పెంచాయి. ఈ కేసుకు సంబంధించి అమిత్ అరోరా అరెస్ట్ విష‌యంలో ఈడీ పూర్తి నివేదిక‌ను కోర్టుకు స‌మ‌ర్పించింది.

అందులో సంచ‌ల‌న విష‌యాలు వెలుగు చూశాయి. క‌విత ఏకంగా 11 ఫోన్లు వాడింద‌ని వాటిని ధ్వంసం చేసింద‌ని తెలిపింది. త‌న‌కు ఏమీ తెలియ‌ద‌ని బుకాయించింది. కావాల‌ని త‌న‌ను ఇరికించేందుకు కేంద్రం కుట్ర ప‌న్నుతోంద‌ని ఆరోపించారు క‌విత‌. నోటీసులు ఇవ్వ‌ర‌ని అనుకున్నారు గులాబీ శ్రేణులు. కానీ దిమ్మ తిరిగేలా సీబీఐ నోటీసులు జారీ చేసింది.

దీంతో గులాబీ వ‌ర్గాల‌లో ఒక్క‌సారిగా ఆందోళ‌న మొద‌లైంది. డిసెంబ‌ర్ 6న విచార‌ణ‌కు హాజ‌రు కావాల‌ని ఆదేశించింది. ఉద‌యం 11 గంట‌ల‌కు హాజ‌రు కావాల‌ని స్ప‌ష్టం చేసింది. ఇందుకు సంబంధించి త‌న‌కు ఏది వీలైతే అది ఎంచు కోవాల‌ని కూడా సూచించింది. సీబీఐకి సంబంధించి హైద‌రాబాద్ ఆఫీసులో కానీ లేదా ఢిల్లీలోని కార్యాల‌యంలో హాజ‌రు కావ‌చ్చంటూ స్ప‌ష్టం చేసింది నోటీసుల్లో.

ఇదిలా ఉండ‌గా ఢిల్లీ లిక్క‌ర్ స్కాంకు సంబంధించి వ‌చ్చిన ఆరోప‌ణ‌ల‌పై కేంద్ర హొం శాఖ డైరెక్ట‌ర్ ప్ర‌వీణ్ కుమార్ రాయ్ చేసిన ఫిర్యాదు మేర‌కు క‌విత‌ను విచార‌ణ‌కు పిలిచిన‌ట్లు పేర్కొంది. ఆమెతో పాటు ఢిల్లీ డిప్యూటీ సీఎం సిసోడియాతో పాటు మ‌రో 14 మందిపై కేసు న‌మోదు చేసిన‌ట్లు తెలిపింది.

Also Read : ష‌ర్మిల‌ను ఈజీగా వ‌ద‌ల‌ను – జ‌గ్గారెడ్డి

Leave A Reply

Your Email Id will not be published!