Bhupesh Baghel: మద్యం కుంభకోణం కేసులో ఛత్తీస్‌గఢ్‌ మాజీ సీఎం ఇంట్లో సీబీఐ సోదాలు

మద్యం కుంభకోణం కేసులో ఛత్తీస్‌గఢ్‌ మాజీ సీఎం ఇంట్లో సీబీఐ సోదాలు

Bhupesh Baghel : ఛత్తీస్‌గఢ్‌ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్‌ నేత భూపేశ్‌ బఘేల్‌(Bhupesh Baghel)పై మద్యం కుంభకోణం ఉచ్చు బిగుస్తోంది. తాజాగా ఆయన ఇంట్లో సీబీఐ సోదాలు నిర్వహిస్తోంది. రాయ్‌పుర్‌, భిలాయిలోని ఆయన నివాసాల్లో సీబీఐ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. భూపేశ్‌ బఘేల్‌ అత్యంత సన్నిహితుడైన ఓ సీనియర్‌ పోలీసు అధికారి ఇంట్లోనూ ఈ దాడులు జరుగుతున్నాయి.

Bhupesh Baghel..

తాజా సోదాలపై సీబిఐ అధికారులు ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. అయితే, మద్యం కుంభకోణానికి సంబంధించిన కేసులోనే ఈ తనిఖీలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవల ఇదే కేసుకు సంబంధించి బఘేల్‌, ఆయన కుమారుడు చైతన్య నివాసంలో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ అధికారులు దాడులు చేసిన సంగతి తెలిసిందే. ఆ సోదాల సందర్భంగా రూ.30 లక్షల నగదు, పలు పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. అయితే ఈ తనిఖీల అనంతరం తిరిగివెళ్తున్న ఈడీ అధికారుల వాహనాలపై నిరసనకారులు రాళ్లు రువ్వడంతో ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి.

ఛత్తీస్‌గఢ్‌(Chhattisgarh)లో భారీ మద్యం కుంభకోణం వెలుగులోకి వచ్చింది. ఈ స్కామ్‌ ద్వారా నిందితులు సుమారు రూ.2వేల కోట్లు లబ్ధి పొందినట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్ తెలిపింది. రాష్ట్రంలో అన్ని మద్యం షాపులను రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తుంది. ఇందులో భాగంగా ఛత్తీస్‌గఢ్‌ స్టేట్‌ మార్కెటింగ్ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ షాపుల నిర్వహణ, నగదు వసూలు, బాటిల్ తయారీ, హాలోగ్రామ్ తయారీ కోసం టెండర్లు పిలుస్తుంది. ఈ క్రమంలో రాజకీయ నాయకులు, సీఎస్‌ఎమ్‌సీఎల్‌ కమీషనర్‌, ఎండీల సహకారంతో తన సన్నిహితులైన వికాస్‌ అగర్వాల్‌, అర్వింద్‌ సింగ్‌లతో కలిసి బాటిల్‌ తయారీ నుంచి మద్యం అమ్మకాల వరకు ప్రతి విభాగంలో పెద్ద ఎత్తున్న లంచాలు ఆశచూపి పూర్తి మద్యం సరఫరా వ్యవస్థను అన్వర్‌ తన ఆధీనంలోకి తెచ్చుకున్నట్లు ఈడీ వెల్లడించింది.

తర్వాత మద్యం సరఫరా చేసే కంపెనీల నుంచి కేస్‌పై (మద్యం బ్రాండ్ ఆధారంగా) రూ. 75 నుంచి రూ. 150 కమిషన్‌ వసూలు చేయడంతోపాటు ప్రైవేటుగా నకిలీ మద్యం తయారుచేసి, వాటిని ప్రభుత్వ దుకాణాల్లో విక్రయించి 30 నుంచి 40 శాతం కమిషన్‌ పొందాడని ఈడీ ఆరోపించింది. అలా, 2019 నుంచి 2022లో సుమారు రూ. 1,200 నుంచి రూ. 1500 కోట్లు అక్రమంగా సంపాదించినట్లు గుర్తించింది. 2022లో ఐఏఎస్‌ అధికారి అనిల్‌ తుటేజాపై ఐటీశాఖ దాడులతో ఈ కుంభకోణం వెలుగు చూసింది.

Also Read : Eknath Shinde: కమెడియన్‌ కామ్రా వివాదంపై స్పందించిన ఏక్‌ నాథ్‌ శిందే

Leave A Reply

Your Email Id will not be published!