MMTS-CCTV Cameras: ఎంఎంటీఎస్‌ బోగీల్లో సీసీ టీవీ కెమెరాలు

ఎంఎంటీఎస్‌ బోగీల్లో సీసీ టీవీ కెమెరాలు

MMTS : సికింద్రాబాద్ నుండి మేడ్చల్ కు ఎంఎంటీఎస్(MMTS) రైలులో వెళ్తుండగా యువతిపై అత్యాచారయత్నం జరిగిన ఘటనను సౌత్ సెంట్రల్ రైల్వే సీరియస్ గా తీసకుంది. ఈ నేపథ్యంలో ప్రయాణికుల భద్రత కోసం మల్టీమోడల్‌ ట్రాన్స్‌పోర్ట్‌ సిస్టమ్‌ (ఎంఎంటీఎస్‌) బోగీల్లో అత్యాధునిక సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేయాలని దక్షిణ మధ్య రైల్వే నిర్ణయించింది. వాటి సాయంతో రియల్‌టైంలో ఎంఎంటీఎస్‌ రైళ్లలో శాంతి భద్రతలను పర్యవేక్షించే బాధ్యతను ప్రభుత్వ రైల్వే పోలీసుల (జీఆర్‌పీ)కు, రైల్వే రక్షణ దళాని (ఆర్‌పీఎఫ్)కి అప్పగించింది. ఎంఎంటీఎస్‌ రైలులో యువతిపై లైంగిక దాడి యత్నం ఘటన నేపథ్యంలో వివిధ విభాగాల ఉన్నతాధికారులతో ఎస్‌సీఆర్‌ జీఎం అరుణ్‌ కుమార్‌ జైన్‌ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రయాణీకులు భద్రత కోసం కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

South Central Railway Arrange CCTC Cameras in MMTS Train

ఈ సమావేశంలో ప్రయాణికులకు భద్రత కోసం ఎంఎంటీఎస్ రైళ్ళలో సీసీటీవీ కేమరాలను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. అంతేకాదు ఎంఎంటీఎస్‌, సబర్బన్‌ రైళ్లలో ప్రయాణికులకు భద్రతపై రాజీ పడొద్దని అధికారులకు స్పష్టం చేశారు. మహిళలపై నేరాల దర్యాప్తు కోసం స్థానిక పోలీసులు, ఆర్‌పీఎఫ్‌, జీఆర్‌పీ జవాన్లతో ఉమ్మడి టాస్క్‌ఫోర్స్‌లు ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు. ముఖ్యంగా మహిళల బోగీల్లోకి ఆకతాయిలు ప్రవేశిస్తే బాధితులకు సులభంగా యాక్సెస్‌ అయ్యేలా పానిక్‌ బటన్‌ అమర్చడంతోపాటు దాన్ని కంట్రోల్‌ రూమ్‌కూ రైలు గార్డుకూ అనుసంధానించేలా ఏర్పాటు చేయాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న భద్రతా హెల్ప్‌లైన్‌ 139 నంబర్‌కు వెంటనే డయల్‌ చేయగలిగేలా ఎస్‌ఓఎస్‌ మొబైల్‌ యాప్‌ తేవాలని సంబంధిత అధికారులకు సూచించారు.

Also Read : Liquor Offer: యూపీలో మందుబాబులకు బంపర్ ఆఫర్ ! ఒకటి కొంటే మరొకటి ఫ్రీ !

Leave A Reply

Your Email Id will not be published!