CDS Anil Chauhan: భవిష్యత్తులో యుద్ధాలకు ఆ నాలుగే కారణాలు – సీడీఎస్ చీఫ్ అనిల్ చౌహాన్
భవిష్యత్తులో యుద్ధాలకు ఆ నాలుగే కారణాలు - సీడీఎస్ చీఫ్ అనిల్ చౌహాన్
CDS Anil Chauhan : ప్రపంచదేశాల మధ్య నెలకొంటున్న ఉద్రిక్తతలపై చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ అనిల్ చౌహాన్ (CDS Anil Chauhan) ఆందోళన వ్యక్తం చేశారు. భారత్ ఎప్పటికీ శాంతి, సుస్థిరత, భద్రతకు కట్టుబడి ఉంటుందని… అయితే దానిని ఆసరాగా చేసుకొని మమ్మల్ని దెబ్బకొట్టాలని చూస్తే మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదని స్పష్టంచేశారు. గతంలో జరిగే యుద్ధాలకు, ప్రస్తుతం జరుగుతున్న యుద్ధాలకు చాలా వ్యత్యాసం ఉందని పేర్కొన్నారు. గతంలో వ్యతిరేక భావజాలం, భూభాగాల స్వాధీనం చేసుకొనేందుకు చేసే యుద్ధాలు అందరి కళ్లకు కనిపించేవని… ప్రస్తుతం కొత్తకొత్త వ్యూహాలతో దేశాలు పరస్పరం యుద్ధ వాతావరణాన్ని సృష్టించుకుంటున్నాయన్నారు.
CDS Anil Chauhan – భవిష్యత్తులో జరగబోయే యుద్ధాలకు నాలుగు కారణాలు
1. వారి వారి రాజకీయ లక్ష్యాలను చేరుకోవడం కోసం ఆయా దేశాలు పరస్పరం బల ప్రయోగానికి దిగడం
2. పోటీ, సంక్షోభం, ఘర్షణ వంటి విషయాల్లో శాంతికి, యుద్ధానికి మధ్య సరైన తేడా తెలుసుకోలేకపోవడం
3. ప్రజల అవసరాలకు అధిక ప్రాధాన్యం ఇవ్వడం
4. విజయాన్ని నిర్ణయించే కొలమానాల్లో వస్తున్న మార్పులు
ఇలాంటి వాటివల్లే భవిష్యత్తులో దేశాల మధ్య యుద్ధాలు వచ్చే అవకాశం ఉందన్నారు. 1971లో పాక్‌తో జరిగిన ఘర్షణల్లో భారత్ 95 వేల మంది పాకిస్థానీయులను బంధించిందని.. కానీ ఇటీవల నిర్వహించిన ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor) లో ఆయుధాల రేంజ్, దాడుల ప్రభావాలను కొలమానంగా తీసుకున్నామని అనిల్ చౌహాన్ తెలిపారు.
ఆపరేషన్ సిందూర్ నుంచి నేర్చుకున్న పాఠాలతో ఆధునిక ఘర్షణలను ఎదుర్కోవడానికి భారత్ సమాయత్తమవుతుందని అనిల్ చౌహాన్ తెలిపారు. ఇందుకోసం త్రివిధ దళాలు కలిసి పనిచేస్తున్నాయన్నారు. మనపై దాడి చేస్తే దాని ప్రభావం ఎలా ఉంటుందో ఆపరేషన్ సిందూర్ సమయంలో ప్రపంచం మొత్తం చూసిందని పేర్కొన్నారు. ఆపరేషన్ సిందూర్ అప్పుడే అయిపోలేదని, ఎప్పటికీ కొనసాగుతుందన్నారు. రక్షణ వ్యవస్థలను, ఆయుధశక్తిని మరింత బలవంతం చేసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. భారత్ అభివృద్ధి చెందిన దేశాల సరసన నిలబడాలంటే ‘శశాస్త్ర’.. ‘సురక్షిత’..‘ఆత్మనిర్భర్’గా మారడం ఎంత అవసరమో ప్రజల సైద్ధాంతికపరమైన ఆలోచనలు.. కార్యాచరణల్లోనూ మార్పు తీసుకురావడం అంతే అవసరమని సీడీఎస్ సూచించారు. అప్పుడే భవిష్యత్తులో ఎదురయ్యే భద్రతాపరమైన సవాళ్లను వేగంగా, నిర్ణయాత్మకంగా ఎదుర్కోగలమని అన్నారు.
Also Read : Annamalai: బీజేపీ నేత అన్నామలైకు చేదు అనుభవం !
