PM Modi : సుస్థిర అభివృద్ది కేంద్రం ల‌క్ష్యం

స్ప‌ష్టం చేసిన ప్ర‌ధాని మంత్రి మోదీ

PM Modi : షార్ట్ క‌ట్ రాజ‌కీయాల‌కు పాల్ప‌డే వారి ప‌ట్ల అత్యంత జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని హెచ్చ‌రించారు ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ. గ‌తంలో ప‌న్ను చెల్లింపుదారుల సొమ్ము అవినీతి, ఓటు బ్యాంకు రాజ‌కీయాల్లో వృథా అయ్యేద‌న్నారు. మ‌రాఠాలో ప‌ర్య‌టించిన న‌రేంద్ర మోదీ ఈ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఈ సంద‌ర్భంగా పీఎం చేసిన కామెంట్స్ క‌ల‌క‌లం రేపాయి.

ఆయ‌న ప్ర‌ధానంగా విపక్షాల‌పై మండిప‌డ్డారు. తాము అభివృద్ది ప్రాతిప‌దిక‌గా ప‌ని చేస్తున్నామ‌ని, కానీ వారు అడ్డుకునే ప్ర‌య‌త్నం చేస్తున్నారంటూ ఆరోపించారు న‌రేంద్ర మోదీ.

దేశానికి ఏం కావాల‌నే దానిపై విప‌క్షాల‌కు క్లారిటీ లేద‌న్నారు. కానీ తాను వ‌చ్చాక దేశంలో కీల‌క మార్పులు చోటు చేసుకున్నాయ‌ని చెప్పారు. ప్ర‌స్తుతం దేశానికి సుస్థిరమైన అభివృద్ది అవ‌స‌ర‌మ‌ని, అందుకే తాము ఎక్కువ‌గా ఫోక‌స్ పెట్టామ‌ని తెలిపారు ప్ర‌ధాన‌మంత్రి. షార్ట్ క‌ట్ రాజ‌కీయాలు కాద‌న్నారు. దీని వ‌ల్ల దేశానికి ప్ర‌మాద‌మ‌ని హెచ్చరించారు న‌రేంద్ర మోదీ(PM Modi).

వీరి నిర్వాకం కార‌ణంగా దేశం సంక్షోభం లోకి కూరుకు పోయింద‌ని మండిప‌డ్డారు. తాను అభివృద్ది ప‌థంలో తీసుకు వెళ్లేందుకు ప్ర‌య‌త్నం చేస్తుంటే విప‌క్షాలు కావాల‌ని అడ్డు ప‌డుతున్నాయంటూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు మోదీ.

గ‌తంలో ప‌న్ను చెల్లింపుదారుల సొమ్ము అవినీతి, ఓటు బ్యాంకు రాజ‌కీయాల్లో వృథా అయ్యేవ‌ని , కానీ తాము తీసుకు వ‌చ్చిన జీఎస్టీ వ‌ల్ల కోట్లాది రూపాయ‌లు ఆదాయంగా దేశానికి ల‌భిస్తోంద‌న్నారు ప్ర‌ధాన‌మంత్రి. రూ. 75,000 కోట్ల విలువైన ప్రాజెక్టుల‌ను ప్రారంభించి ప్ర‌సంగించారు మరాఠాలో. గ‌త ఎనిమిదేళ్ల‌లో మౌలిక స‌దుపాయాల అభివృద్దిపై ఫోక‌స్ పెట్టామ‌న్నారు మోదీ.

Also Read : బొగ్గు స్కాంలో రూ. 152.31 కోట్ల ఆస్తులు సీజ్

Leave A Reply

Your Email Id will not be published!