Puja Khedkar Controversy: ట్రైనీ పూజా ఖేడ్కర్ తల్లిదండ్రుల ‘వైవాహిక స్థితి’ వివరాలు కోరిన కేంద్రం..!
ట్రైనీ పూజా ఖేడ్కర్ తల్లిదండ్రుల 'వైవాహిక స్థితి' వివరాలు కోరిన కేంద్రం..!
Puja Khedkar Controversy: ఐపీఎస్ ట్రైనీ పూజా ఖేడ్కర్ రోజు రోజుకు చుట్టూ మరిన్ని వివాదాలు ముదురుతున్నాయి. తాజాగా ఆమె తల్లిదండ్రుల “వైవాహిక స్థితి” పై సమాచారాన్ని కేంద్రం కోరింది. ఈ మేరకు పుణె పోలీసులకు నుంచి ఆదేశాలు వెళ్లాయి. యూపీఎస్సీ పరిక్షల్లో ఓబీసీ నాన్-క్రీమీలేయర్ కోటా కోసం పూజా ఖేడ్కర్ తన తల్లిదండ్రులు విడిపోయారని క్లెయిమ్ చేసుకున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. తల్లిదండ్రుల వార్షిక ఆదాయం రూ.8 లక్షలు కంటే తక్కువ ఉంటేనే ఓబీసీ నాన్-క్రీమీ లేయర్ కోటా వర్తిస్తుంది. తన తల్లిదండ్రులు వేర్వేరుగా ఉంటున్నారని, ఆమె తన తల్లి దగ్గర ఉంటున్నారని పూజా ఖేడ్కర్ క్లెయిమ్ చేశారు. ఆమె తండ్రి ప్రభుత్వ ఉద్యోగంలో క్లాస్ వన్ ఆఫీస్‌ర్‌గా పనిచేశారు. ఈ నేపథ్యంలో స్పష్టత కోసం ఖేడ్కర్ తల్లిదండ్రుల వైవాహిక స్థితిపై వివరాలు ఇవ్వాలని పుణె పోలీసులకు కేంద్రం ఆదేశాలిచ్చింది.
పుణె జిల్లా కలెక్టరేట్లో శిక్షణ సమయంలో పూజా ఖేడ్కర్(Puja Khedkar Controversy) నిబంధనలకు విరుద్ధంగా సౌకర్యాలు డిమాండ్ చేయడంతో వివాదం మొదలై… ప్రైవేటు వాహనంపై ఎర్రబుగ్గను ఏర్పాటు చేసుకోవడం, దానిపై మహారాష్ట్ర ప్రభుత్వం పేరు రాసి ఉండటం మరింత వివాదమైంది విష్యం తెలిసిందే . ఈ క్రమంలో ఆమె ప్రొబేషన్‌ను నిలిపివేల తిరిగి అకాడమీకి రావాలని ఆదేశాలు జారీ అయ్యాయి. జూలై 23వ తేదీలోగా ముస్సోరిలోని లాల్ బహదూర్ శాస్త్రి జాతీయ అకాడమీకి రావాలని ఆదేశించారు. మరోవైపు, అధికార దుర్వినియోగం, యుపీఎస్సీ(UPSC)కి తప్పుడు అఫిడవిట్లు సమర్పించడం వంటి ఆరోపణలు రావడంతో ఆమెపై ఉన్నతాధికారులు చర్యలకు దిగారు.
Puja Khedkar Controversy – యుపీఎస్సీ చర్యలు..!
పూజా ఖేడ్కర్ నకిలీ ధ్రువపత్రాలు సమర్పించిన మోసానికి పాల్పడినట్టు యూపీఎస్సీ ఇటీవల ధ్రువీకరిస్తూ చర్యలకు దిగింది. క్రిమినల్ కేసు నమోదు చేసింది. 2022 యుపీఎస్సీ అభ్యర్థిత్వాన్ని రద్దు చేయడంతో పాటు భవిష్యత్తులో మళ్లీ నియామక పరీక్షలు రాయకుండా డిబార్ చేసేందుకు రంగం సిద్ధం అయింది. దీనిపై వివరణ ఇవ్వాలంటూ నోటీసు జారిచేసింది. ఖేడ్కర్ తన పేరు, తల్లిదండ్రుల పేర్లు, సంతకం, ఈమెయిల్ ఐడీ, మొబైల్ నెంబర్, చిరునామా పత్రాలను మార్చడం ద్వారా మోసపూరిత చర్యలకు పాల్పడినట్టు యూపీఎస్సీ పేర్కొంది.
Also Read : KTR: గురువారం ‘కాళేశ్వరం’ సందర్శనకు బీఆర్ఎస్ బృందం. !