Arvind Kejriwal CBI : దర్యాప్తు సంస్థలు వేధిస్తున్నాయి
సీఎం అరవింద్ కేజ్రీవాల్ కామెంట్స్
Arvind Kejriwal CBI : ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ నిప్పులు చెరిగారు. ఆయన కేంద్ర సర్కార్ పై భగ్గుమన్నారు. ఆపై కేంద్రం కనుసన్నలలో నడుస్తున్నాయంటూ కేంద్ర దర్యాప్తు సంస్థలపై మండిపడ్డారు. సీబీఐ, ఈడీ, ఐటీ మోదీ చెప్పినట్లు ఆడుతున్నాయంటూ ఆరోపించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. నిష్పక్షపాతంగా ఉండాల్సిన దర్యాప్తు సంస్థలు కోర్టులకు అన్నీ అబద్దాలే చెబుతున్నాయంటూ ఆవేదన వ్యక్తం చేశారు అరవింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal CBI).
ఇదిలా ఉండగా ఢిల్లీ లిక్కర్ స్కాం కేసుకు సంబంధించి ఢిల్లీ సీఎంకు ఈనెల 16న ఉదయం 11 గంటలకు తమ ముందు హాజరు కావాలని సమన్లు జారీ చేసింది. లేకపోతే తీవ్ర చర్యలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించింది. ఇదిలా ఉండగా కేంద్రం కావాలనే ఇరుకున పెట్టేందుకు కేజ్రీవాల్ పై అక్రమ కేసులు బనాయించిందని ఆరోపించింది.
ప్రజలను ప్రధానంగా ప్రతిపక్షాలను, బీజేపీ వ్యతిరేకులను టార్గెట్ చేసి వేధింపులకు పాల్పడుతున్నాయంటూ సీరియస్ కామెంట్స్ చేశారు సీబీఐ, ఈడీ, ఐటీలపై. పూర్తి స్వయం ప్రతిపత్తితో పని చేయాల్సిన దర్యాప్తు సంస్థలు మోదీ జేబు సంస్థలుగా మారి పోయాయంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. సీబీఐ రెండో సారి కోర్టుకు సమర్పించిన ఛార్జి షీట్ లో ఎమ్మెల్సీ కవిత, కేజ్రీవాల్ కు రూ. 100 కోట్లు చేతులు మారాయంటూ పేర్కొంది. ఈ మేరకు ఆయనకు సమన్లు ఇచ్చింది.
Also Read : కేజ్రీవాల్ సమన్లపై సిబల్ ఫైర్