Centre Issues : సెలబ్రిటీలు..ప్రముఖులకు కేంద్రం షాక్
మార్గదర్శకాలు విడుదల చేసిన ప్రభుత్వం
Centre Issues : కేంద్రం మెల మెల్లగా సోషల్ మీడియాపై ఫోకస్ పెడుతోంది. తన కంట్రోల్ లోకి తీసుకు రావాలని అనుకుంటోంది. ఇక నుంచి ఏది పడితే అది రాసేందుకు గానీ, అభిప్రాయాలు పంచుకునేందుకు వీలుండదు.
ప్రధానంగా దేశంలోని సెలబ్రిటీలు , సామాజిక మాధ్యమాలను ప్రభావితం చేసే వ్యక్తులు విధిగా రూల్స్(Centre Issues) పాటించాలని స్పష్టం చేసింది కేంద్రం. ఏ మాత్రం గీత దాటినా చర్యలు తప్పవంటూ హెచ్చరించింది. కేంద్రం కొత్తగా మార్గదర్శకాలు జారీ చేసింది. వినియోగదారుల రక్షణ చట్టంపై ఫోకస్ పెట్టింది.
ఇందుకు సంబంధించి మంగళవారం సంచలన ప్రకటన చేసింది. కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ ఎండార్స్మెంట్స్ నో హౌస్ అనే పేరుతో మార్గదర్శకాలను విడుదల చేసింది. సెలబ్రిటీలు, సోషల్ మీడియా ప్లాట్ ఫారమ్ లలో ప్రభావితం చేసే వ్యక్తుల కోసం, ఉత్పత్తులు లేదా సేవలను ఆమోదించేటప్పుడు వ్యక్తులు తమ ప్రేక్షకులను తప్పుదారి పట్టించకుండా చూసుకోవాలని స్పష్టం చేసింది.
సెలబ్రిటీలు, ఇన్ ఫ్లుయెన్సర్ లు , వర్చువల్ ఇన్ ఫ్లుయెన్సర్ లు తమ ప్రేక్షకులతో పారదర్శకత, ప్రామాణికతను కొనసాగించేందుకు కేంద్రం జారీ చేసిన మార్గదర్శకాలకు కట్టుబడి ఉండాలని వార్నింగ్ ఇచ్చింది.
వీటిని ఏ మాత్రం వ్యతిరేకించినా చర్యలు ఉంటాయని పేర్కొంది. అది ఎవరైనా ఎంతటి వారైనా సరే రూల్స్ పాటించాల్సిందేనని(Centre Issues) వెల్లడించింది. సిఫార్సులు తప్పనిసరిగా సరళమైన, స్పష్టమైన భాషలో ఉండాలని , ప్రకటన , ప్రాయోజిత, సహకారం లేదా చెల్లింపు ప్రమషన్ వంటి పదాలను ఉపయోగించ వచ్చని తెలిపింది కేంద్రం.
Also Read : వేలాది మందిపై వేటుకు ‘మెటా’ సిద్దం