Congress Support AAP : ఆప్ కి కాంగ్రెస్ మద్దతు
కేంద్రం ఆర్డినెన్స్ పై గుస్సా
Congress Support AAP : కర్ణాటకలో ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత కీలక పరిణామాలు చోటు చేసుకుంటన్నాయి. జేడీయూ చీఫ్, బీహార్ సీఎం నితీశ్ కుమార్ విపక్షాలను ఏకం చేసే పనిలో పడ్డారు. ఇప్పటికే సీఎంలు మమతా బెనర్జీ, అరవింద్ కేజ్రీవాల్ , ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ , ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే, మాజీ చీఫ్ రాహుల్ గాంధీ తో భేటీ అయ్యారు. ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ తో ములాఖత్ అయ్యారు. ఇదే సమయంలో సుప్రీంకోర్టు ఢిల్లీ సర్కార్ కు సర్వాధికారాలు ఉంటాయని స్పష్టం చేసింది. దీనిని అడ్డుకునేందుకు కేంద్రంలో కొలువు తీరిన మోదీ ప్రభుత్వం కీలకమైన నిర్ణయం తీసుకుంది.
ఈ మేరకు ఆర్డినెన్స్ జారీ చేసింది. ఇదిలా ఉండగా కేంద్రం నియమించిన లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనాకు విశిష్ట అధికారాలంటూ ఉండవని స్పష్టం చేసింది. శాంతి భద్రతలు, భూ సంబంధ వ్యవహారాలు తప్పితే మిగతావన్నీ ఆప్ ప్రభుత్వానికి చెందుతాయని సంచలన తీర్పు వెలువరించింది. దీంతో కేంద్రానికి కోలుకోలేని షాక్ తగిలింది. ఉన్నతాధికారుల పోస్టింగ్ లు, బదిలీల వ్యవహారానికి సంబంధించి సర్వ హక్కులు కేంద్రానికి ఉండేలా తాజాగా ఆర్డినెన్స్ తీసుకు వచ్చింది.
ఇది ఆమోదం పొందాలంటే తప్పనిసరిగా లోక్ సభతో పాటు రాజ్యసభలో ఆమోదం పొందాల్సి ఉంటుంది. కాగా బీజేపీకి(BJP) లోక్ సభలో స్పష్టమైన మెజారిటీ ఉంది. కానీ రాజ్యసభలో లేదు. దీంతో నితీశ్ కుమార్ ఆప్(APP) సీఎంకు మద్దతు తెలిపారు. ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ , సీఎం మమతా బెనర్జీ సైతం మద్దతు ప్రకటించారు కేజ్రీవాల్ కు. సోమవారం ఏఐసీసీ(AICC) కీలక నాయకుడు కేసీ వేణుగోపాల్ సంచలన ప్రకటన చేశారు. ఆప్ కి మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారు.
Also Read : CM Siddaramaiah