Journalists Security : గ్యాంగ్ స్టర్ల హత్య జర్నలిస్టులకు భద్రత
కట్టుదిట్టం చేస్తామని ప్రకటించిన కేంద్రం
Journalists Security : కేంద్రంలో కొలువు తీరిన మోదీ బీజేపీ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. శనివారం రాత్రి యూపీలోని ప్రయాగ్ రాజ్ లో వైద్య పరీక్షల నిమిత్తం బయలు దేరిన గ్యాంగ్ స్టర్లు అతిక్ అహ్మద్, అష్రఫ్ అహ్మద్ లు కాల్చి చంపబడ్డారు. ముగ్గురు షూటర్లు ఈ ఘాతుకానికి పాల్పడ్డారు.
విచిత్రం ఏమిటంటే ఇద్దరూ జైలులో ఉన్న వారే. వాళ్ల చేతులకు బేడీలు ఉన్నాయి. పోలీసుల సమక్షంలోనే ఈ ఘటన జరగడం కలకలం రేపింది. అయితే షూటర్లు పాయింట్ బ్లాంక్ లో కాల్చడం , వారంతా విలేకర్ల ముసుగులో రావడంతో ఈ ఘటన చోటు చేసుకుంది.
దీనిపై కేంద్ర సర్కార్ తీవ్రంగా స్పందించింది. ఈ కాల్పుల ఘటనలో ఓ కానిస్టేబుల్ తో పాటు మరో జర్నలిస్ట్ గాయపడ్డాడు. ఈ మేరకు ప్రింట్ , ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులకు ఇక నుంచి పూర్తి భద్రత(Journalists Security) కల్పించనున్నట్లు ప్రకటించింది. స్టాండర్డ్ ఆపరేటింగ్ విధానాలను సిద్దం చేయాలని నిర్ణయించినట్లు పేర్కొంది.
జర్నలిస్టుల భద్రత కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలో , కేంద్ర హోం శాఖ అమిత్ చంద్ర షా మార్గదర్శకత్వంలో హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రామాణిక ఆపరేటింగ్ విధానాలను సిద్దం చేస్తోందని పేర్కొన్నారు.
Also Read : ఎన్ కౌంటర్ ప్రదేశ్ గా మార్చేశారు