CEO Vikas Raj : ఓటేయండి ప్రజాస్వామ్యాన్ని కాపాడండి
రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్
CEO Vikas Raj : హైదరాబాద్ – రాష్ట్రంలో ఎన్నికల సంబురం కొనసాగుతోంది. నవంబర్ 30న పోలింగ్ జరగనుంది. దేశ వ్యాప్తంగా 5 రాష్ట్రాలలో ఎన్నికలు జరుగుతున్నాయి. వచ్చే జనవరి నాటికి ఆయా రాష్ట్రాలకు సంబంధించి ఫలితాలు పూర్తవుతాయి. ఇందులో భాగంగా తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ వికాస్ రాజ్ సంచలన ప్రకటన చేశారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడారు. పోలింగ్ సందర్భంగా సర్కార్ సెలవు డిక్లేర్ చేసిందని తెలిపారు.
CEO Vikas Raj Comment
సెలవు రోజు అనుకుని ఇంటి వద్ద కూర్చోవద్దని , ప్రతి ఒక్కరు ఓటు వేయాలని, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని పిలుపునిచ్చారు వికాస్ రాజ్(CEO). అర్హులైన ప్రతి ఓటరు ఓటును వినియోగించాలని సూచించారు. గతంలో జరిగిన పోలింగ్ లో పోలింగ్ శాతం తగ్గిందని ఈసారి పెంచేందుకు చర్యలు చేపట్టినట్లు చెప్పారు.
ఓటర్లు స్వేచ్చగా ఓటు వేసేందుకు గాను రాష్ట్ర వ్యాప్తంగా 35 వేల 655 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్టు వెల్లడించారు సీఈవో. ఖాకీలతో పాటు ఉద్యోగులు దాదాపు 3 లక్షల మందికి పైగా విధులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 4, 70, 270 పోస్టల్ బ్యాలెట్ లు ఉన్నాయని, ఈవీఎంల కోసం 8,84,584 బ్యాలట్ పేపర్లను ముద్రించామన్నారు.
మొత్తం 119 నియోజకవర్గాలు ఉన్నాయని, ఒక్కో నియోజకవర్గానికి ఒక అబ్జర్వర్ ను నియమించడం జరిగిందని వెల్లడించారు వికాస్ రాజ్. ఈసారి తొలిసారి ఓట్ ఫర్ హోం ను ప్రవేశ పెట్టామని చెప్పారు.
Also Read : Revanth Reddy Comment : రేవంత్ జోరు కాంగ్రెస్ హుషారు