Chandi Yagam Athirudram : నేటితో అతిరుద్రం ప‌రిపూర్ణం

- చండీ యాగం సప్త వ‌ర్ణ శోభితం

Chandi Yagam Athirudram : శ్రీ‌కృష్ణ పీఠాధిప‌తి శ్రీ‌శ్రీ‌శ్రీ కృష్ణ జ్యోతి స్వ‌రూపానంద స్వామీజీ ఆధ్వ‌ర్యంలో 80వ విశ్వ శాంతి మ‌హాయాగ మ‌హోత్స‌వాన్ని న‌భూతో న‌భ‌విష్య‌త్ అన్న రీతిలో చేప‌ట్టారు. ఆగ‌స్టు 14న ప్రారంభ‌మైన చండీ యాగం భ‌క్తుల సంద‌డితో అల‌రారింది. జ‌డ్చ‌ర్ల(Jadcherla) ప‌ట్ట‌ణం ఆధ్యాత్మిక శోభ‌ను సంత‌రించుకుంది.

Chandi Yagam Athirudram Will Complete

స్వామి వారి దివ్య మంగ‌ళా శాస‌నాల‌తో ఈ కార్య‌క్ర‌మానికి శ్రీ‌కారం చుట్టారు . ఆగ‌స్టు 27 ఆదివారం పూర్ణాహుతితో ,ఉట్లు కొట్ట‌డంతో పూర్త‌వుతుంది. ఇదిలా ఉండ‌గా ఇప్ప‌టి వ‌ర‌కు విశేష‌మైన ఆధ్యాత్మిక కార్య‌క్ర‌మాల‌తో అల‌రారింది ఈ ప్రాంతమంతా.

రోజూ వారీ కార్య‌క్ర‌మాల ప‌రంగా చూస్తే 14న సోమ‌వారం గ‌ణ‌ప‌తి పూజ‌, శుద్ది పుణ్య‌హ‌వాచ‌నం, పంచ‌గ‌వ్య ప్రాశ‌న‌, బుత్విక్ వ‌రుణ‌, గో స‌హిత యాగ‌శాల ప్ర‌వేశం చేశారు. అఖండ జ్యోతి స్థాప‌న‌(Akhanda Jyothi), యాగ‌శాల సంస్కార‌ములు, మాతృకాపూజ‌, వాస్తు హోమాలు, ప్ర‌ధాన మంట‌ప ఆరాధ‌న‌, ప్ర‌ధాన క‌ల‌శ స్థాప‌న , అగ్ని మ‌థ‌న‌, అగ్ని ప్ర‌తిష్ట‌, ధ్వ‌జారోహ‌ణం, ప‌ర్య‌గ్నీక‌ర‌ణ నిర్వ‌హించారు స్వామి వారు.

15న మంగ‌ళ‌వారం మ‌హా గ‌ణ‌ప‌తి, ల‌క్ష్మీ గ‌ణ‌ప‌తి , చండీ, ఆది ల‌క్ష్మీ హోమాలు చేప‌ట్టారు. సామూహిక ల‌క్ష గ‌రికార్చ‌న నిర్వ‌హించారు.

16న బుధ‌వారం ధ‌న్వంత‌రి, న‌క్ష‌త్ర, ధ‌న‌ల‌క్ష్మీ హోమాలు జ‌రిగాయి. 17న గురువారం శ్రీ‌ల‌క్ష్మీ కుబేరం అష్ట‌ల‌క్ష్మీ ధాన్య ల‌క్ష్మీ హోమాలు చేప‌ట్టారు. అనంత‌రం శ్రీ ఉమామ‌హేశ్వ‌ర స్వామి క‌ళ్యాణ మ‌హోత్స‌వం అంగ‌రంగ వైభ‌వంగా జ‌రిపించారు శ్రీ‌శ్రీ‌శ్రీ శ్రీ‌కృష్ణ‌జ్యోతి స్వ‌రూపానంద స్వామి(Sri Sri Sri Krishnajyoti Swaroopananda Swami) వారు.

18న శుక్ర‌వారం విశేష చండీ స‌హిత గ‌జ‌ల‌క్ష్మీ హోమాలు, సామూహిక విశేష ల‌క్ష్మీ కుంకుమార్చ‌న‌, ల‌క్ష గాజులార్చ‌న‌లు నిర్వ‌హించారు.

19న శ‌నివారం శ్రీ ల‌క్ష్మీ న‌ర‌సింహ స‌హిత సుద‌ర్శ‌న‌, ల‌క్ష్మీనారాయ‌ణ న‌వ‌గ్ర‌హ‌, సంతాన ల‌క్ష్మీ హోమాలు జ‌రిపారు. వేంక‌టేశ్వ‌ర స్వామి క‌ళ్యాణ మ‌హోత్స‌వంతో పాటు లక్ష బిల్వార్చ‌న‌, రుద్రాక్ష మార్చ‌న ఘ‌నంగా నిర్వ‌హించారు.

20న ఆదివారం సూర్య , స‌ర‌స్వ‌తి, ధైర్య‌లక్ష్మీ హోమాలు, విశేష సూర్య న‌మ‌స్కారాలు జ‌రిపారు. స‌రస్వ‌తి పూజ‌లు, బాల పూజ‌లు చేప‌ట్టారు.

21న సోమ‌వారం మృత్యుంజ‌య రుద్ర హోమాలు, విజ‌య ల‌క్ష్మీ హోమం జ‌రిపించారు. సాయంత్రం ద‌శ స‌హ‌స్ర విశేష అభిషేకాలు నిర్వ‌హించారు.

22న మంగ‌ళ‌వారం వివాహం కాని ఆడ‌, మ‌గ‌వారికి హోమాలు జ‌రిపించారు. అనంత‌రం ఆంజ‌నేయ స్వామి వారికి ల‌క్ష త‌మ‌ల‌పాకుల అర్చ‌న చేప‌ట్టారు.

23న బుధ‌వారం స‌ర్వ సూక్త‌, సుబ్ర‌హ్మ‌ణ్య స‌మేత సంతాన వేణుగోపాల హోమాలు నిర్వ‌హించారు, శ్రీ ల‌క్ష్మీ నృసింహ క‌ళ్యాణ మహోత్స‌వాన్ని న‌భూతో న‌భ‌విష్య‌త్ అన్న రీతిలో చేప‌ట్టారు.

24న గురువారం శ్రీ మేధా ద‌క్షిణ మూర్తి, రామ గాయ‌త్రి స‌హిత చండీ హోమాలు నిర్వ‌హించారు. అనంత‌రం శ్రీ సీతారామ స్వామి క‌ళ్యాణ మ‌హోత్స‌వం ఘ‌నంగా చేప‌ట్టారు.

25న శుక్ర‌వారం చండీ స‌హిత న‌వ దుర్గ హోమాలు , సామూహిక లక్ష్మీ వ్ర‌తం . జ‌రిపించారు. వ‌ర‌ల‌క్ష్మి అమ్మ వారికి విశేష చ‌క్ర అర్చ‌న‌, పంచామృత అభిషేకం , ల‌క్ష గాజుల అర్చ‌న‌, లక్ష కుంకుమ అర్చ‌న నిర్వ‌హించారు స్వామి వారు.

26న శ‌నివారం శ్రీ సుద‌ర్శ‌న పూర్వ‌క మ‌హా మృత్యుంజ‌య‌, వ‌ర‌ల‌క్ష్మీ స‌మేత మ‌హా నారాయ‌ణ హోమాలు జ‌రిపించారు, సీతారాముల‌కు విశేష అభిషేకాలు చేప‌ట్టారు.

27న ఆదివారం మ‌హా పూర్ణాహుతి, గురు పూజ‌, శ్రీ‌కృష్ణ ఉట్టి కొట్ట‌డం జ‌రుగుతుంది. సాయంత్రం 6 గంట‌ల‌కు శ్రీ‌రాధా కృష్ణ శాంతి క‌ళ్యాణ మ‌హోత్స‌వంతో పూర్త‌వుతుంది. భ‌క్తులు విశేషంగా పాల్గొని త‌ర‌లించాల‌ని స్వామి వారు కోరారు.

Also Read : Ayutha Chandi Yagam : చండీ యాగం ఆధ్యాత్మిక శోభితం

Leave A Reply

Your Email Id will not be published!