Chandra Babu Cases-8: చంద్రబాబుపై ఎనిమిది కేసులు
బెయిల్ వచ్చే ఛాన్స్ కష్టం
Chandra Babu Cases : అమరావతి – టీడీపీ చీఫ్, మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ప్రస్తుతం అనారోగ్య రీత్యా బెయిల్ పై ఉన్నా శాశ్వతంగా జైలుకు వెళ్లే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కంటి శస్త్ర చికిత్స కోసం తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరారు చంద్రబాబు. ఈ మేరకు కోర్టు నాలుగు వారాల పాటు వెసులుబాటు ఇచ్చింది.
Chandra Babu Cases Eight
ఇదిలా ఉండగా ఇప్పటి వరకు నారా చంద్రబాబు నాయుడుపై(Chandra Babu) 8 కేసులు నమోదు చేసింది ఏపీ సీఐడీ. ఇందులో స్కిల్ డెవలప్ మెంట్ స్కాం . ఈ కేసుకు సంబంధించి ఆయనను రాజమండ్రి జైలులో 53 రోజుల పాటు జైలలో ఉంచారు. రిమాండ్ ఖైదీగా ఉన్న ఆయనకు నవంబర్ 28 వరకు బెయిల్ ఇచ్చింది కోర్టు.
ఇదే కేసుకు సంబంధించి క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. సుప్రీంకోర్టు ఇంకా దీనిపై తీర్పు ఇవ్వలేదు. ఇసుక కుంభ కోణం కేసులో చంద్రబాబు నాయుడుపై కేసు నమోదైంది. ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరారు చంద్రబాబు. దీనిపై హైకోర్టు విచారిస్తోంది. నవంబర్ 22కి విచారణ వాయిదా వేసింది.
మరో వైపు ఫైబర్ నెట్ స్కాం కేసులో చంద్రబాబుపై కేసు నమోదు చేసింది. నవంబర్ 30కి వాయిదా వేశారు. నవంబర్ 30కి విచారణ వాయిదా వేసింది కోర్టు. అంగళ్లులో అల్లర్లకు సంబంధించి ఏ1గా చంద్రబాబుతో పాటు మరో 170 మందిని చేర్చింది
అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు ఎలైన్మెంట్ స్కాం కేసులో చంద్రబాబు నాయుడుపై కేసు నమోదు చేశారు. ఈ కేసుకు సంబంధించి నవంబర్ 22కి వాయిదా వేసింది. మద్యం పాలసీలో అక్రమాలకు పాల్పడ్డారంటూ ఆరోపించింది ఏపీ సీఐడీ.
Also Read : Ponguleti Srinivas Reddy : తెలంగాణ పేరుతో నిలువు దోపిడీ