Chandra Babu Lokesh : అమ‌రావ‌తినే ఏపీకి రాజ‌ధాని

స్ప‌ష్టం చేసిన చంద్ర‌బాబు ..నారా లోకేష్

Chandra Babu Lokesh : అమ‌రావ‌తి – తెలుగుదేశం పార్టీ చీఫ్ నారా చంద్ర‌బాబు నాయుడు, జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేష్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఈ మేర‌కు ఏపీలో కొన‌సాగుతున్న మూడు రాజ‌ధానుల వ్య‌వ‌హారంపై తీవ్ర స్థాయిలో మండిప‌డ్డారు. ఎలాంటి ప్లాన్ లేకుండా సైకో జ‌గ‌న్ తీసుకున్న ఈ నిర్ణ‌యం వ‌ల్ల రాష్ట్ర ప్ర‌జ‌లు ఎంత‌గానో ఇబ్బందులు ప‌డుతున్నార‌ని ఆవేద‌న చెందారు.

Chandra Babu Lokesh Comment about Capital

ఇప్ప‌టి వ‌ర‌కు ఏపీకి ఏ ప్రాంతం రాజ‌ధానిగా ఉందో చెప్ప‌లేని ప‌రిస్థితిలో ప్ర‌భుత్వం ఉండ‌డం బాధాక‌ర‌మ‌న్నారు. ఇది ఎంత మాత్రం ఆమోద యోగ్యం కాద‌న్నారు నారా చంద్ర‌బాబు నాయుడు(Chandra Babu), నారా లోకేష్.

తాము రైతులు, ఉద్య‌మ‌కారుల‌కు స్ప‌ష్టం చేస్తున్నామ‌ని అమ‌రావ‌తి త‌ప్ప ఇంకో దానిని స్వీక‌రించే ప్ర‌స‌క్తి లేద‌న్నారు. అమ‌రావ‌తి కేంద్ర రాజ‌ధానిగా ఉండాలంటూ జేఏసీ ఆద్వ‌ర్యంలో ఏర్పాటైన క‌మిటీ డిమాండ్ చేసింది. వారికి సంపూర్ణ మ‌ద్ద‌తు ఇస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు చంద్ర‌బాబు, లోకేష్‌.

ఇక నుంచే కాదు ఎల్ల‌ప్ప‌టికీ ఎల్ల‌ప్ప‌టికీ అమ‌రావ‌తినే ఏపీకి రాజ‌ధానిగా ఉండాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు . జై అమ‌రావ‌తి అంటూ నినాదాలు చేశారు నారా చంద్ర‌బాబు నాయుడు. రాబోయే రోజుల్లో ల‌క్ష‌ల కోట్లు ఖ‌ర్చు చేసి ప్ర‌పంచంలోనే అద్భుత‌మైన న‌గ‌రంగా తీర్చి దిద్దుతామ‌ని స్ప‌ష్టం చేశారు.

Also Read : PM Modi : పార్ల‌మెంట్ ఘ‌ట‌న బాధాక‌రం

Leave A Reply

Your Email Id will not be published!