Chandra Babu Naidu : వైసీపీ నేతలకు బంపర్ ఆఫర్
టీడీపీ చీఫ్ నారా చంద్రబాబు నాయుడు
Chandra Babu Naidu : అమరావతి – తెలుగుదేశం పార్టీ చీఫ్ , మాజీ సీఎం చంద్రబాబు నాయుడు సంచలన ప్రకటన చేశారు. ఏపీ వైసీపీ నేతలు ఎవరైనా సరే వస్తానంటే తాము స్వాగతిస్తామని స్పష్టం చేశారు . చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. త్వరలోనే రాష్ట్రంలో ఎన్నికలు రానున్నాయి. ఈ తరుణంలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు.
Chandra Babu Naidu Offers
ప్రజాభిప్రాయ సేకరణ తర్వాతే అభ్యర్థులను ఖరారు చేయడం జరుగుతుందన్నారు టీడీపీ చీఫ్. కుప్పంలో కూడా ప్రజాభిప్రాయం తర్వాతే నిర్ణయం తీసుకుంటాని స్పష్టం చేశారు. వైసీపీ నుంచి ఎవరైనా , ఎక్కడి నుంచైనా వస్తామంటే పరిశీలిస్తామని పేర్కొన్నారు.
రేపటి ఎన్నికలు చరిత్రాత్మకం కానున్నాయని అన్నారు. రాష్ట్ర భవిష్యత్తు ఎన్నికలపై ఆధారపడి ఉందన్నారు చంద్రబాబు నాయుడు(Chandra Babu Naidu). ప్రజలు అన్నింటిని గమనిస్తున్నరాని అన్నారు. సరైన సమయంలో తీర్పు చెప్పేందుకు సిద్దంగా ఉన్నారని జోష్యం చెప్పారు.
రాష్ట్రంలో జగన్ రాక్షస పాలన కొనసాగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. తమ పార్టీకి చెందిన నేతలు, కార్యకర్తలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. తాము పవర్ లోకి వచ్చాక కావాలని కేసులు నమోదు చేసిన వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Also Read : Satyavathi Rathod : లాకప్ డెత్ పై విచారణ చేపట్టాలి