Chandra Babu Naidu : సహాయక చర్యల్లో జగన్ విఫలం
చంద్రబాబు నాయుడు కామెంట్స్
Chandra Babu Naidu : అమరావతి – ఏపీలో ఎడ తెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా చోటు చేసుకున్న పరిస్థితులను అంచనా వేయడంలో, సహాయక చర్యలు తీసుకోవడంలో ఏపీ సర్కార్ , సీఎం జగన్ రెడ్డి వైఫల్యం చెందారంటూ సంచలన కామెంట్స్ చేశారు మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు.
Chandra Babu Naidu Comments on Jagan
కనీసం తుఫాను బాధితులకు భోజనం పెట్టే స్థితిలో ప్రభుత్వం లేదా అని ప్రశ్నించారు. ముందస్తుగా వాతావరణ శాఖ హెచ్చరించినా ఎందుకు పట్టించు కోలేదని నిలదీశారు. బాధితులకు ఎలాంటి సహాయం చేయక పోవడం దారుణమని పేర్కొన్నారు చంద్రబాబు.
పార్టీకి సంబంధించిన నేతలు, బాధ్యులు, కార్యకర్తలు వెంటనే బాధితులకు సహాయం చేయాలని ఆదేశించారు. అంతా అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేశారు. ఆయా ముంపునకు గురైన గ్రామాలు, బాధిత ప్రాంతాలలో పలువురితో నేరుగా ఫోన్ లో మాట్లాడారు చంద్రబాబు నాయుడు(Chandra Babu Naidu). కష్టాల్లో ఉన్న ప్రజలకు అండగా ఉండాలని సూచించారు.
ఆనాడు హుద్ హుద్ , తిత్లీ తుఫాన్లు వచ్చిన సమయంలో పరిహారం పెంచి సహాయం చేస్తామన్నారు. పెరిగిన సాగు ఖర్చులను దృష్టిలో పెట్టుకుని జగన్ సర్కార్ పరిహారం పెంచాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు మాజీ సీఎం.
బాధితులకు ఆహారం, నీళ్లు, షెల్టర్ ఇవ్వడంలో వైసీపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆవేదన వ్యక్తం చేశారు.
Also Read : TTD Chairman : అన్న ప్రసాదంపై దుష్ప్రచారం తగదు