Chandrababu Case : బాబు బెయిల్ పిటిష‌న్ వాయిదా

30కి వాయిదా వేసిన సుప్రీంకోర్టు

Chandrababu Case : అమ‌రావ‌తి – ఏపీ స్కిల్ స్కాం కేసులో అడ్డంగా బుక్కై రాజ‌మండ్రి జైలులో 53 రోజుల పాటు రిమాండ్ ఖైదీగా ఉన్న టీడీపీ చీఫ్ , మాజీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడుకు(Chandrababu) బెయిల్ ల‌భించింది. ఆయ‌న‌కు కంటి శ‌స్త్ర చికిత్స నిమిత్తం నాలుగు వారాల పాటు బెయిల్ ఇస్తూ త‌రీ్పు చెప్పారు కోర్టు జ‌డ్జి.

Chandrababu Case Updates

ఇందులో భాగంగా ఏపీ స్కిల్ స్కాంతో పాటు ఫైబ‌ర్ నెట్ స్కాం, అమ‌రావ‌తి రింగ్ రోడ్డు ఎలైన్మెంట్ స్కాం కేసులు న‌మోదు చేసింది. దీనికి సంబంధించి త‌న‌కు ముంద‌స్తు బెయిల్ ఇవ్వాల‌ని కోరుతూ పిటిష‌న్ దాఖ‌లు చేశారు. హైకోర్టు దావాను కొట్టి వేసింది.

దీంతో ఆయ‌న సుప్రీంకోర్టును ఆశ్ర‌యించారు ఫైబ‌ర్ నెట్ స్కాం కేసుకు సంబంధించి బెయిల్ ఇవ్వాల‌ని. దీనిపై విచార‌ణ చేప‌ట్టింది కోర్టు. ఇరువురి త‌ర‌పు వాద‌న‌లు విన్న ధ‌ర్మాసనం న‌వంబ‌ర్ 30కి వాయిదా వేస్తున్న‌ట్లు స్ప‌ష్టం చేసింది.

మాజీ సీఎంకు ముంద‌స్తు బెయిల్ ఇవ్వాలా లేదా అన్న దానిపై తుది తీర్పు ఆరోజు వెళ్ల‌డిస్తామ‌ని అంత దాకా ఎలాంటి కామెంట్స్ చేయ‌కూడ‌ద‌ని పేర్కొంది. మ‌రో వైపు క్వాష్ పిటిష‌న్ పై దీపావ‌ళి సెల‌వుల అనంత‌రం తీర్పు వెలువ‌రించ‌నుంది కోర్టు. ఇదిలా ఉండ‌గా దీపావ‌ళి పండుగ ఉండ‌డంతో కోర్టుకు 19 దాకా సెల‌వులు ఉన్నాయి.

Also Read : CM KCR Nomination : గ‌జ్వేల్ లో కేసీఆర్ నామినేష‌న్

Leave A Reply

Your Email Id will not be published!