Chandrababu Naidu ACB Court : రెండు రోజుల కస్టడీకి చంద్రబాబు
క్వాష్ పిటిషన్ కొట్టేసిన ధర్మాసనం
Chandrababu Naidu ACB Court : విజయవాడ – టీడీపీ చీఫ్ , మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడుకు కోలుకోలేని షాక్ తగిలింది. ఏపీ సీఐడీ దాఖలు చేసిన కేసుకు సంబంధించి విజయవాడలోని ఏసీబీ కోర్టు విచారణ చేపట్టింది. ఇప్పటికే చంద్రబాబు రిమాండ్ లో ఉన్నారు.
ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ స్కిల్ స్కామ్ కేసులో రూ. 371 కోట్లు చేతులు మారాయని, షెల్ కంపెనీల ద్వారా హవాలా మార్గంలో డబ్బులు చేతులు బాబుకు అందాయని ఆరోపించింది. ఇప్పటికే ఏసీబీ కోర్టుకు 25 పేజీల నివేదిక అందజేసింది.
Chandrababu Naidu ACB Court Custody Extended
దీనిని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టు లాయర్లు హరీశ్ సాల్వే, సిద్దార్థ్ లూథ్రా వాదనలు వినిపించారు. చంద్రబాబు నాయుడును(Chandrababu Nadu) కస్టడీకి ఇవ్వాలని ఏపీ సీఐడీ తరపు లాయర్ కోరారు. దీనిపై విచారించిన కోర్టు ఊహించని రీతిలో షాక్ ఇచ్చింది . 2 రోజుల కస్టడీకి ఇస్తూ తీర్పు ఇచ్చారు జడ్జి.
ఏపీ సీఐడీ తమకు 5 రోజులు కస్టడీకి ఇవ్వాలని కోరారు. కానీ అందుకు ఒప్పుకోలేదు న్యాయమూర్తి. ఇదే సమయంలో ఎవరు చంద్రబాబు నాయుడును విచారిస్తారో వారి వివరాలు అందజేయాలని ఆదేశించింది. రాజమండ్రిలో రిమాండ్ ఖైదీగా ఉన్న చంద్రబాబును జైలులోనే విచారించనున్నారు.
Also Read : Biyyapu Madhusudhan Reddy : బాలయ్యకు మెంటల్