Chandrababu Naidu Arrest : చంద్రబాబు బెయిల్ పై విచారణ
వస్తుందా రాదా అన్న దానిపై ఉత్కంఠ
Chandrababu Naidu Arrest : అమరావతి – ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ స్కిల్ స్కామ్ లో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న టీడీపీ చీఫ్, మాజీ ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu) ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్నారు. ఏపీ సీఐడీ బాబును నంద్యాలలో అదుపులోకి తీసుకుంది.
Chandrababu Naidu Arrest Viral
తమ ఆఫీసులో 20 ప్రశ్నలు సంధించింది. ఏ ఒక్క ప్రశ్నకు సరైన సమాధానం ఇవ్వలేదని ఏపీ సీఐడీ ఆరోపించింది. ఏకంగా 10 గంటల పాటు ప్రశ్నించింది. దీంతో కంచనపల్లి నుండి ఏసీబీ కోర్టులో హాజరుపర్చారు.
చంద్రబాబు తరపున సుప్రీంకోర్టు లాయర్ లూథ్రా , వెంకటేశ్వర్ రావు వాదించారు. ఏపీ ప్రభుత్వం తరపున అడిషనల్ ఏజీ సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించారు. ఆరున్నర గంటల పాటు సాగింది విచారణ. చివరకు జడ్జి హిమ బిందు సంచలన తీర్పు వెలువరించారు.
నారా చంద్రబాబు నాయుడుపై ఏపీ సీఐడీ 25 పేజీల రిపోర్టు సమర్పించింది. 14 రోజుల రిమాండ్ విధించింది. బాబు అరెస్ట్ అయి మంగళవారం నాటికి 10 రోజులు పూర్తయ్యాయి. తాజాగా హైకోర్టులో చంద్రబాబుకు బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేశారు. ప్రస్తుతం విచారణ జరగనుంది. బాబుకు బెయిల్ వస్తుందా లేదా అన్నది తేలాల్సి ఉంది.
Also Read: Madhu Yashki Goud : అధికారంలోకి వస్తే హామీలు అమలు