Chandrababu Naidu : కురుక్షేత్ర యుద్దం ప్రారంభం
కౌరవ వధ జరగడం మాత్రమే మిగిలింది
Chandrababu Naidu : టీడీపీ చీఫ్ , మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన మరోసారి ఏపీ సీఎం జగన్ రెడ్డిని టార్గెట్ చేశారు. రాష్ట్రంలో ప్రజలకు రక్షణ లేకుండా పోయిందన్నారు. ప్రస్తుతం జరుగుతున్నది కురుక్షేత్ర యుద్దమన్నారు టీడీపీ చీఫ్. వార్ స్టార్ట్ అయ్యిందని , ఇక మిగిలింది కౌరవ వధ మాత్రమేనని పేర్కొన్నారు. అసెంబ్లీకి ఉన్న విలువను దిగజార్చిన ఘనత సీఎం జగన్ కు దక్కుతుందన్నారు.
సోమవారం నారా చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu) మీడియాతో మాట్లాడారు. తాను సీఎంగా కొలువు తీరితేనే ఏపీలో ఉన్న ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారం లభిస్తుందని చెప్పారు . ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి విఫలమయ్యారని ఆరోపించారు. రాబోయే ఎన్నికల్లో ఓటమి ఖాయమని , తాము అధికారంలోకి రావడం తథ్యమని జోష్యం చెప్పారు టీడీపీ చీఫ్.
రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా దెబ్బ తిన్నదని, పాలన గాడి తప్పిందని అమాయకులను టార్గెట్ గా చేసుకుని వైసీపీ శ్రేణులు, నాయకులు దాడులకు పాల్పడుతున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు నారా చంద్రబాబు నాయుడు. వ్యవస్థలను నిర్వీర్యం చేస్తూ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం పాలు చేసిన ఘనత జగన్ రెడ్డికే దక్కుతుందన్నారు. ప్రజలు మార్పు కోరుకుంటున్నారని ఇక మిగిలింది వైకాపా ప్రభుత్వాన్ని దించడమేనని స్పష్టం చేశారు.
Also Read : MK Stalin Rahul : సోదరా ప్రజల కోసం కలిసి నడుద్దాం