Chandrababu Naidu : సీఈసీని కలవనున్న బాబు
ఏపీలో దొంగ ఓట్లపై ఫిర్యాదు
Chandrababu Naidu : తెలుగు దేశం పార్టీ కన్వీనర్ , మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఈనెల 28న ఢిల్లీకి వెళ్లనున్నారు. కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ ను కలవనున్నారు. ఈ మేరకు టీడీపీ సీఈసీకి లేఖ రాసింది. తమ నేత తమరిని కలవాలని అనుకుంటున్నారని, అనుమతి ఇవ్వాలని కోరింది పార్టీ. ఇదే విషయాన్ని పార్టీ వెల్లడించింది.
Chandrababu Naidu Will Meet Centre Election Commissioner
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఏపీ సర్కార్ దొంగ ఓట్లను చేరుస్తోందని ఆరోపించారు నారా చంద్రబాబు నాయుడు. ప్రతిపక్షాలకు చెందిన సానుభూతి పరులను గుర్తించి, వారి ఓట్లను తొలగించడం కావాలని చేస్తున్నారంటూ ఆరోపించారు.
ఇందుకు సంబంధించిన సాక్ష్యాధారాలను సీఈసీకి అందజేయాలని నిర్ణయం తీసుకున్నామని స్పష్టం చేశారు చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu). ఆయా జిల్లాల అధికారులకు దొంగ ఓట్ల తతంగాన్ని తమ పార్టీ నేతలు ఫిర్యాదు చేసినా, ఆధారాలు సమర్పించినా పట్టించు కోలేదని ఆవేదన వ్యక్తం చేశారు .
ఈ విషయాన్ని కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ కు తాము వివరించాలని ఇందు కోసం ఢిల్లీకి వెళ్లాలని నిర్ణయం తీసుకున్నామన్నారు నారా చంద్రబాబు నాయుడు. ఏపీలో ఓటర్ల జాబితాలో అక్రమాలపై సమాచార సేకరణకు ఇప్పటికే టీడీపీ కేంద్ర ఆఫీసులో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేశామన్నారు.
ఇదిలా ఉండగా మంగళవారం పరిటాల శ్రీరామ్ జిల్లా కలెక్టర్ ను కలిసి దొంగ ఓట్లపై ఫిర్యాదు చేశారు.
Also Read : Buggana Rajendranath Reddy : కర్నూలులో హైకోర్టు నిర్మాణం