Chandrababu Naidu: హస్తినకు చంద్రబాబు! అమిత్ షా, నిర్మలా సీతారామన్‌తో భేటీ !
హస్తినకు చంద్రబాబు! అమిత్ షా, నిర్మలా సీతారామన్‌తో భేటీ !
Chandrababu Naidu : ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర మంత్రులతో వరుసగా భేటీ అవుతున్నారు. బుధవారం మధ్యాహ్నం కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలిసి… అరకు కాఫీతో పాటు ఓ జ్ఞాపికను అందజేశారు. చంద్రబాబుతో(Chandrababu Naidu) పాటు కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్ ఉన్నారు. అమిత్ షాతో సమావేశమై వివిధ అంశాలపై దాదాపు గంట పాటు చర్చించారు. అనంతరం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మాలా సీతారామన్‌ను కలిశారు. చంద్రబాబుతో పాటు రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ కూడా నిర్మలా సీతారామన్‌ను కలిసి… రాష్ట్ర బడ్జెట్ ప్రతులను ఆమెకు అందజేశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, ఏపీకి ఆర్థికంగా మరిన్ని వెసులుబాట్లు కల్పించే అంశంపై నిర్మలా సీతారామన్‌తో సీఎం, ఆర్థిక మంత్రి చర్చలు జరిపారు. ఇటీవలే ఏపీలో ప్రవేశపెట్టిన బడ్జెట్ వివరాలను ఆమెకు వివరించారు. క్యాపిటల్ ఎక్స్ పెడించర్ నిధుల కోసం ప్రత్యేకంగా వీజీఎఫ్ స్కీం ప్రవేశపెట్టడంపై ప్రత్యేకంగా ప్రస్తావించారు. దేశంలో తొలిసారిగా ఈ తరహా విధానం ఉందన్న చర్చల్లో భాగంగా నిర్మలా సీతారామన్ అభిప్రాయపడ్డారు.
Chandrababu Naidu Meet
వీజీఎఫ్ స్కీంలో భాగంగా కార్పస్ ఫండ్ నిమిత్తం రూ. 2 వేల కోట్లు కేటాయించామని సీఎం చంద్రబాబు, ఆర్థిక మంత్రి పయ్యావుల వివరించారు. వివిధ మార్గాల్లో ఇప్పటి వరకు అందించిన సాయంపై నిర్మలా సీతారామన్‌కు ఏపీ సీఎం చంద్రబాబు కృతజ్ఞతలు తెలిపారు. ఇక పైనా ఇదే తరహా సహకారం ఉండాలని.. వీలైనన్ని కేంద్ర పథకాలను రాష్ట్రంలో అమలు చేసేందుకు సిద్దంగా ఉన్నామని, తమకు నిధులు కూడా అదే స్థాయిలో వచ్చేలా చూడాలని కేంద్ర ఆర్థిక మంత్రిని సీఎం చంద్రబాబు, మంత్రి పయ్యావుల కోరారు.
Also Read : AP High Court: విశాఖ బీచ్ లో అక్రమ నిర్మాణాపై హై కోర్టు సీరియస్